Sunday, April 28, 2024

జ్ఞానజ్యోతి స్వరూపులుశ్రీ వేంకట దాసాచార్యులు

తెలంగాణలో వెలసిన సుప్రసిద్ధ వాగ్గేయకారులలో ఒకరు శ్రీ రాకమచర్ల వేంకటదాసులవారు. అనంతగిరి (వికారాబాద్‌) జిల్లా పూడూరు మండలంలోని పెద్దఉమ్మెంతలలో వున్న వారి పీఠంలో నేటి నుంచి మూడు రోజులపాటు భజన సాంపద్రాయ మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా…

ముచుకుందావతారులుగా ప్రసిద్ధిగాంచిన వేంకటదా సాచార్యులు సుమారు 150 సంవత్సరములకు పూర్వం, పాలమూరు జిల్లా అచ్చంపేట తాలూకా పెద్దాపురం గ్రామంలో పురుషోత్తమరావు అనంతమాంబ దంపతులకు మూ డవ సంతానంగా జన్మించారు. యోగిని మరికంటి లింగమాంబ దర్శనం చేసుకొని… నీలంగిరి వీర య్యప్ప దగ్గర గురూపదేశం తీసుకున్నారు.
పూర్వజన్మలో ముచుకుందుడుగా యుండి తపమాచ రించి ముచుకుందా క్షేత్రమని ప్రసిద్ధిగాంచిన రాకమాద్రికి మూడు కిలోమీటర్ల దూరంలో పెద్దఉమ్మెంతల గ్రామంలో నివాసం ఏర్పరచుకొని రాకమాద్రిపై ఆర్చారూపమున వెలసియున్న శ్రీ లక్ష్మీ యోగానంద నరసింహస్వామి వారిని దర్శిం చి, శ్రీహరి కరుణా కటాక్షముచే పెల్లుబుకిన వర కవితా వాక్పటిమతో అనేక మధురాతి మధుర కీర్తనల చే… శ్రీహరిని స్తుతించారు. ఆయన లక్ష కీర్తనలు రచించారని సమాచా రం. కానీ 500 మాత్రమే లభించాయి.
పండిత పామరులందరికీ సులభంగా అర్థమయ్యేట ట్లుగా భక్తి భావముప్పొంగేవిధంగా అమృత జ్ఞాన యోగ గుళికల (గంగాజల బిందువులు) కీర్తనలు అందించారు. తెలంగాణా పల్లెపల్లెలోకి చొరబడి అందరి గుండెల్లోకి చొచ్చు కొని పోయాయి. వారు భక్తి చైతన్యాన్ని ప్రజల్లో వ్యాపింప జేశారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట ముత్యాల మూట య్యింది. మన ప్రాంతాన్ని పునీతం చేశాయి.
వేంకటదాసు ఆచార్యులవారు శాలివాహన శకవర్షం బులు 1851 సిద్ధాద్రి నామ సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు భౌతిక దేహము విసర్జించి దివ్య దే#హంబు గైకొని శ్రీహరి సన్నిధికి చేరారు. వారి సమాధి పెద్దఉమ్మెంత ల గ్రామంలో ఉంది. ప్రస్తుత పీఠాధిపతి వేంకటదాసుగారు అక్కడ ఆలయా న్ని నిర్మించారు. వారిక్కడ జన్మించడం తెలుగువారి పుణ్య ఫలం. వివాహతులైననూ.. భౌతిక ప్రపంచానికి ప్రాధా న్యం ఇవ్వక యోగిపుంగవుని వలె తన జీవితము కొనసా గించి అన్నమయ్య, త్యాగయ్య, భక్త రామదాసు కోవకి చెందిన వాగ్గేయకారులు వేంకటదాసా చార్యులు. మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించిన జ్యోతి స్వ రూపులు. శ్రీ వెంకటదాసాచార్యులు పరమపదించిన మార్గశిర శుద్ధ త్రయోదశిని సమారాధన దినోత్సవంగా పాటిస్తున్నారు.
తన సంకీర్తనల ద్వారా మనలో భక్తి భావాన్ని నిర్మా ణం చేసి తద్వారా… మానవతావాదాన్ని, దైవ వాదాన్ని, ఏకాత్మతా వాదాన్ని స్థాపించి… సమైక్యతను ఏర్పరచిన మహనీయులు శ్రీ వెంకటదాసాచార్యులు. తెలంగాణ పల్లె పల్లెలోనికి చొచ్చుకొనిపోయి శ్రీ వేంకటదాసు కీర్తనలను అధ్యయనం చే యడం, పరమార్థాలు తెలుసుకోవడం వల్ల దివ్య జ్ఞానం దిశగా పయనిస్తాం. వీరి కీర్తనలు మనలను పారమార్థిక చింతన వైపుగా నడిపించి, కర్మ భక్తి జ్ఞానంలో ముంచెత్తి, దివ్య మార్గం చూపి, మనందరినీ సమసమాజం వైపుగా నడిపిస్తాయి.
ముస్లిం రాజుల పాలనలో… ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందించి, కష్టజీవుల్లో సమైక్య జీవన సౌందర్యాన్ని, అమృతాన్ని అందించారు రాకమచ ర్ల వేంకటదాసు వారు. అతని కీర్తనలు పాడినా విన్నా భవరోగాలు పోయి భవ బం ధాలు పటిష్టమవుతాయి. ఆయన కీర్తనలు పాడుతుంటే మనముందు భగవంతుడు కనబడతారని భక్తుల నమ్మకం. భక్తిరసం ఉప్పొంగుతుంది. మోక్షానికి రాచబాటలు వేస్తా యి. మనందరి నాలుకల మీద నాట్యమాడే తారక మంత్రా లు. ఈ కీర్తనలు భక్తజనులందరికీ నిత్య స్మరణీయాలు. ప్రతి భక్తుని గుండె గుడిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. మన మందరం ఆ మధుర భక్తి రసస్రవంతిలో ఓల లాడుదాం.
రాకమాద్రి ముచుకుందుని తపోనిద్ర దగ్గర పుట్టిన నీటి బుగ్గనే ముచుకుందా (నేటి మూసి)నది. శ్రీ వేంకటదాసుల వారి కీర్తనలను అధ్యయనం చేయడం, పరమార్థాలు తెలు సుకోవడం వల్ల సమైక్య పటిష్టమైన జాతి నిర్మాణం జరిగి, దివ్యజ్ఞానం వైపుగా మనం పయనించగలుగుతాం.
ప్రసిద్ధి గాంచిన రాకమచర్ల పుణ్యక్షేత్రాన్ని, వా రి కీర్తన లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చే విధం గా… రాకమాద్రి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని; సాహత్యా నికి పెద్దపీట వేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని భక్తు లు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement