Friday, May 17, 2024

జగన్మాత నవరాత్రుల ఆంతర్యం…!

రే పటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభిస్తారు. మనం జగన్మాత, దుర్గాదేవి స్వరూపాలను తొమ్మి ది రోజులు ఆరాధిస్తాం. జగన్మాతను తొమ్మిదిరోజు లు ఆరాధించడంలోని విశిష్టత తెలుసుకొందాం.
విశ్వమంతా ‘మాత స్వరూపం’తో నిబిడీకృతమై ఉం ది. ప్రతీ జీవి జన్మకు కారణభూతురాలు మాతృమూర్తే! భారతీయ సంస్కృతిలో మాత పదానికి విశేషమైన గౌరవ భావం ఉంది. భూమాత, గోమాత, భారతమాత, గంగా మాత అంటూ ఇలా ప్రకృతిలోని అన్నింటిని మాత భావన తోనే చూస్తూంటాం. పిలుస్తూంటాము. ‘అమ్మ’ అనే పదం మధురమైన వాక్కు. స్వార్థం లేనిది, త్యాగానికి ఆదర్శమైనది.
బిడ్డకు తొలి గురువు అమ్మే. వేదం కూడా ‘మాతృదేవో భవ’ అని అగ్రతాం బూలం ఇచ్చింది. మన తల్లి గృహాన్ని తీర్చిదిద్దితే, ఈ జగత్తును సక్రమంగా నడిపిస్తూ, లోక సంక్షేమం కోసమే రాక్షస సంహారం చేసి, జగత్తులోని తన భక్తు లకు, ప్రజలకు అండగా నిలిచింది జగన్మాత. ఇచ్ఛారూ పిణి నిత్యానిత్య స్వరూపిణి, విశాలాక్షి అయిన ‘దుర్గాదేవి’ని మనం ఆశ్వీయుజ మాసంలో ”దేవి నవరా త్రులు” చేసి ఆరా ధించడం, మనలని మనం గౌరవించుకొన్నట్లే. అందుకే సృ ష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులు అమ్మను దర్శించి …—
”నమోదేవ్యై ప్రకృత్య్రైచ విధాత్య్రై, సతతం నమ:
కళ్యాణ్యౖ కామదాయై, చ వృద్ధైన సిిద్ధ్యై నమో నమ:!!” అంటూ అంజలి ఘటించి, స్తుతించారు. (దేవీభాగవతం)
పోతనామాత్యుడు భాగవతం ప్రారంభంలోనే- ”అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపు టమ్మ చాల పెద్దమ్మ” అని ప్రార్థించారు. అమ్మలగన్నయమ్మ ఎవ రు? ఆయనే అదే పద్యంలో దుర్గమాయమ్మ అని చెప్పారు. ముగ్గురమ్మలు మహాకాళి, మహాల క్ష్మి, మహా సరస్వతులు.
అమ్మ విద్యాభ్యాస సమయంలో బుద్ధిని, జ్ఞానాన్ని, విద్యను అనుగ్ర#హంచే శక్తిగా సరస్వతీ దేవిగాను; ధనాన్ని, సంపదలు, శుభాన్ని అనుగ్ర#హంచేటప్పుడు ప్రేమ, కరుణ, చూపే పగడపు కాంతులతో ప్రకాశించే మహాలక్ష్మిగాను, శత్రువులను, రాక్షసులను సం#హరించి, భక్తులను రక్షించి భ యాన్ని పోగొట్టే మహాకాళిగా దుర్గ గోచరమవుతోంది. అయినా అమ్మకు ఒక పేరేమిటి? ఒక చోటు ఏమిటి? కామా క్షిని కొలిచినా, మీనాక్షిని స్తుతించినా, లలితారాధన చేసినా, చాముండేశ్వరి వద్దకు వెళ్ళి ఆశ్రయించిన పలికేది ఆ తల్లే. అభయం ఇచ్చేది ఆ తల్లే! జగన్మాత. దుర్గాదేవి. సాత్త్విక- రాజసిక- తామసిక గుణాలు మూడు కలిసిన ఆదిపరాశక్తి యొక్క భౌతిక రూపం. అందుకే దేవి స్తుతిలో- —
”యాదేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమ:!!”
సర్వభూతములందు చేతనా (తెలివి) స్వరూపం, బుద్ధి స్వరూపం, శక్తి స్వరూపం, లక్ష్మీ స్వరూపం, శాంతి స్వరూ పం వృత్తి స్వరూపం, శ్రద్ధా స్వరూపం, దయాస్వరూపం, ఇలా మాత స్వరూపమై ఉండే దేవికి నమస్కారం అని వివ రించబడింది. ఇంద్రాది దేవతలు దుర్గాదేవిని స్తుతించారు.
‘దుర్గ’ అంటే- ”దుర్గతిన్‌ గమయతి దూరం యతి సా దుర్గ” అని. జీవుల దుర్గతిని, కష్టాలను, పోగొట్టి, సద్గతిని, శుభాలను కలుగచేసే తల్లి. ఆమె నవ దుర్గలుగా అవతరించి, చంఢ ముండులు, శుంభ నిశుంభులు, రక్తబీజుడు, దుర్గ ముడు, ధూమ్రలోచన మ#హషాసురులు వంటి రాక్షసులను సం#హరించి, దేవతల అభ్యున్నతికి, మూడు లోకాలు సంర క్షించి మహోపకారం చేసింది. అందుకే దేవీ నవరాత్రులు పేరిట ఆమెను ఆరాధిస్తున్నాము.

దేవీ నవరాత్రులు ముఖ్య ఉద్దేశ్యం

దుర్గాదేవి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూ ష్మాండ, స్కంద మాత, కాత్యాయని, మంగళగౌరీ, కాళరా త్రి, సిద్ధిధాత్రి అనే తొమ్మిది రూపాలతో రాక్షస సంహారం చేసింది. ఈ రూపాలే నవదుర్గలు. మనం నిత్యం పఠించే శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో చివర్లో ”నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మికాం” అని వస్తుంది. ఈ నవ దుర్గల రూపాలతో ఉత్తరాదిన, బెంగాల్‌, ఒరిస్సా– జార్ఖండ్‌, వంటి అనేక రాష్ట్రాలలో నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. మన దక్షిణ భారతదేశంలో ఆమె ప్రతి రూపాలైన బాలాత్రిపుర సుందరి, లలితాదేవి, మహాలక్ష్మి, మహా సరస్వతీ, దుర్గా దేవి, ఆఖరు రోజు శ్రీ రాజరాజేశ్వరిగా ఆరాధన చేస్తారు.
మనం తల్లి కడుపులో నవమాసాలు మలమూత్రాల మధ్య కొట్టుమిట్టాడుతూ ”హ! భగవాన్‌! ఎందుకు ఈ జన్మ? మళ్ళీ జన్మంటూ లేకుండా చేయి” అని ప్రార్థిస్తామని భాగవతం చెబుతున్నది. అందుకు ప్రతీకగా నవరాత్రులు.
జగన్మాత లలితా పట్టారికా నివసించే మణిద్వీపానికి నవ ద్వారాలు..అవే మన శరీరంలో ఉన్న నవ ద్వారాలకు సంకే తం. మన ప్రాణం పోయే సందర్భంలో వీటిలో ఏదోక ద్వారం ద్వారానే వెడలి పోతుంది.
మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మద, మోహ మాత్స ర్యాలు ఆరు, అహంకారం, అహంస, అతిశయం వంటి దుర్గుణాలను రూపుమా పేందుకు ప్రతీకగా తొమ్మిదిరోజు లు చేస్తారు. శంకరాచార్యులు ఒక సందర్భంలో- —
”మాతాచ పార్వతీదేవి! పితాదేవో మహశ్వర:!
బాంధవా: శివ భక్తాశ్చ! స్వదేశో భువన త్రయమ్‌!!” అని కీర్తించారు. అమ్మ ఆరాధన వల్ల మనకు కలిగే ”తాప త్రయాలు” అన్నీ తొలగించబడతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement