Sunday, May 12, 2024

ఆత్మతత్వ శోధనలో భ్రమలే భూమికలు

ధర్వణ వేదాంతర్గతమైన అన్నపూర్ణోపనిషత్తు ఆత్మ తత్త్వము తెలుసుకోడానికి చేసే సాధనలో ఐదు రకాలైన భ్రమలు మనలను ఆవర్తిస్తాయని చెబుతుంది. అవి- 1. ”జీవ ఈశ్వరౌ భిన్న రూపా:”: ఇది మొదటి భ్రమ. జీవుడు, ఈశ్వ రుడు భిన్న రూపులు. అంటే జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అని భావించడము మొద టి భ్రమ. నిజానికి ఈశ్వరుడే జీవుడుగా కనిపిస్తున్నాడు.
2. ”ఆత్మనిష్ఠం కర్తృగుణం వాస్తవం”: ఇది రెండవ భ్రమ. ఆత్మ ఈ జగత్తు విష యంలో, కర్తృత్వ నిష్ఠను కలిగి ఉంది అనుకోవడం భ్రమ. నిజానికి ఆత్మ అకర్త. అంటే దానికి కర్తృత్వమే లేదు.
3. ”శరీర త్రయ సంయుక్త జీవ: సంగీ”: జాగ్రత్‌, స్వ ప్న, సుషుప్తులనే త్రిపురుషకారాలతో ఈ జీవుడు బద్ధుడై ఉన్నాడనుకొనేది మూడవ భ్రమ. జీవుని వాస్తవ రూపం జా గ్రత్‌, స్వప్న, సుషుప్తులకు పరిమితం కాదనేది వాస్తవము.
4. ”జగత్‌ కారణ రూపస్య వికారిత్వం”: ఈ ప్రపం చం కారణంగానే నాకు వికారములు కలుగుతున్నా యను కోవడము నాలుగవ భ్రమ. భ్రమలు స్వీయ మనోక ల్పితాలే తప్ప జడమైన జగత్తు వలన కలగడంలేదనేది వా స్తవం.
5. ”కారణాత్‌ భిన్న జగత: సత్యత్వం”:—కార్య రూప మైన ఈ లోకము సత్యము అనుకోవడం ఐదవ భ్రమ. జగ త్తుకు, ఆత్మకు అభేదమని ప్రాజ్ఞులంటారు. ఆత్మ విచారణ ద్వారా, చాలాకాలం ప్రయత్నంచేసి ఈ భ్రమలను పోగొట్టు కోగలిగేవారు నిశ్చల, నిర్మల ప్రజ్ఞా సంస్థితులు అంటారు.
”యావత్‌ సర్వం న సంత్యక్తం తా వత్‌ ఆత్మా నలభ్యతే”
సర్వ భ్రమలను తొలగించుకోనంత వరకు ఆత్మ అను భవంలోకి రాదన్నది జ్ఞానుల మాట. ఆత్మ విచార మార్గం లో ఏడు స్థితులు లేదా భూమికలు ఉన్నాయి. వాటిని ‘సప్త జ్ఞాన భూమికలు” అం టారు. అవి- 1) శుభేచ్ఛ: ఇచ్ఛ అంటే కోరిక.తనకు ఆత్మజ్ఞాన ము లభించాలి అనే తీవ్రమైన కోరికను శుభేచ్ఛ అంటారు. 2) విచారణ: ఆత్మజ్ఞానాన్ని ఏవిధంగా సంపా దించాలి అనే తీవ్ర ఆలోచన, శోధనలను విచారణ అంటారు.
3.తను మానసం: ఆత్మ జ్ఞానాన్ని పొందాలనే తీవ్రమైన కోరికతో, దానిని పొందే సాధనా మార్గాన్ని తెలుసుకొని, సదా నిమగ్నులై ఉండడమే ‘తనమానసం’.
4) సత్త్వాపత్తి: తమో, రజో గుణాలను దూరం చేసుకొని, శుద్ధ సాత్విక గుణాన్ని సా ధించడాన్ని ‘సత్త్వాపత్తి’ అంటారు. మనసు పూర్తిగా స్వాధీనమైన, బ్ర#హ్మవిదుడైన వ్యక్తి స్థితి ఇది.
5) అసంసక్తి: శాశ్వతమైన ఆత్మజ్ఞానం కోసం అశాశ్వతాలైన దే#హము, సంసార బంధాల పట్ల ఆసక్తి చూపకుండా, తామరాకుపై నీటిబొట్టులాగా తటస్థంగా ఉంటూ, తన ధ్యాసను కేవలం ఆత్మజ్ఞానం పొందడం పైననే నిలుపగలిగే స్థితి ఇది.
6) పదార్థ భావని: ప్రతి పదం యొక్క, ప్రతి వస్తువు యొక్క భావనలో ప్రత్యక్షం గా ఇమిడిపోయే స్థితి ఇది. దీనినే సవికల్ప సమాధి లేక సిద్ధస్థితి అంటారు. దాదాపు తన సంశయాలన్నింటికీ సమాధానాలు లభించినప్పటికీ ఇంకా మిగిలిన సంశయాలకు సమాధానాలు అన్వేషించే స్థితి ఇది.
7) తురీయం: ఇది బ్ర#హ్మ జ్ఞానం లేదా ఆత్మజ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందిన స్థితి. జాగ్రత్‌, స్వప్న, సుషుప్త స్థితులను దాటి నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన దశ. ఏ సంశయాలూ లేకుండా ఆత్మతత్త్వా న్ని ఆకళింపు చేసుకొన్న స్థితి.
యోగ వాసిష్ఠము ఏడు జ్ఞాన భూమికలతో బాటు, ఏడు అజ్ఞాన భూమికలను పేర్కొంది. అజ్ఞాన భూమికలు బా#హ్య విషయ ప్రవృత్తి కలిగి, దే#హమునందు అ#హంభా వాన్ని పొంది, అజ్ఞానానికి, దు:ఖానికి కారణాలు అవుతా యి. అవి- 1) బీజ జాగ్రత్తు: జాగ్రదవస్థ నుండి సుషుప్త్య వస్థ అంతము వరకు అజ్ఞానముతో కూడిన చైతన్య స్థితి.
2) జాగ్రత్‌ స్థితి: తనచే చూడబడుతున్న, అనుభవిం చబడుతున్న భౌతిక విషయాలన్నీ తనవే అని భావించడం జాగ్రత్‌ స్థితి. 3) మహా జాగ్రత్‌ స్థితి: జన్మ, జన్మాంతర వాసనలను దృఢపరచుకొనే స్థితి ఇది.
4) జాగ్రత్‌ స్వప్నం: జాగ్రత్‌ స్థితిలో అనుభవంలోకి వచ్చిన/ రాకున్న వాటినే మనసులో నిలుపుకొని, వాటిని స్వప్న దశలో అనుభవించడం. 5) స్వప్నం: స్వప్నాన్ని సత్యము అని భావించే స్థితి. 6) స్వప్న జాగ్రత్‌: కలలో తోచిన విషయాలను జాగ్రత్‌ స్థితిలో వృద్ధిపొందించుకొనే స్థితి.
7) సుషుప్తి: పై ఆరు స్థితులనూ పొంది జడస్థితిలో ఉన్న జీవుడు దు:ఖకారకము లైన వాసనలచే దీర్ఘకాలిక లేదా శాశ్వత జడునిగా మారే పరిస్థితి.
పురుష ప్రయత్నము, విషయ భోగములు అనే ఈ రెండు అజ్ఞాన భూమికలు దు: ఖానికి కారణాలని వశిష్ఠుడు చెప్పాడు. ఇవేకాక అజ్ఞానం, ఆవరణం, విక్షేపం, పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం, నిరంకుశ తృప్తి, అత్యంతిక దు:ఖ నాశం అనే ఏడు కూడా అజ్ఞా న భూమికలుగా చెప్ప బడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement