Sunday, October 6, 2024

India vs Ausis – శుభమ‌న్ గిల్ ఔట్ …… భార‌త్ 260/3

ఇండోర్ : భార‌త్ – ఆసీస్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్ లో ఓపెన‌ర్ శుభ‌మ‌న్ గిల్ 104 పరుగులు చేసి మూడో వికెట్ గా వెనుతిరిగాడు.. 97 బంతుల‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ ల‌తో ఈ స్కోర్ ను సాధించాడు.. గ్రీన్ బౌలింగ్ లో క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట‌య్యాడు.. ప్ర‌స్తుతం భార‌త్ స్కోర్ 36 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 260 ప‌రుగులు చేసింది.. రాహుల్ 28 , ఇషాన్ కిష‌న్ 7 ప‌రుగుల‌తో క్రీజ్ లో ఉన్నారు.

అంత‌కు ముందు మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ , గిల్ లు శ‌త‌కాల‌తో క‌దం తొక్కారు. 16 ప‌రుగులు వ‌ద్ద తొలి వికెట్ ప‌డిన అనంత‌రం క్రీజ్ లోకి వ‌చ్చిన శ్రేయ‌స్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించాడు.. ఫోర్ల లో ఆసీస్ బౌల‌ర్ల‌కు షాక్ ఇచ్చాడు.. కేవ‌లం 86 బంతుల‌లోనే వంద ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు.. ఈ శ‌త‌కంలో 11 ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి.. అనంత‌రం 105 ప‌రుగుల చేసిన అయ్యర్ ను అబాట్ ఔట్ చేశాడు..

ఇక మ‌రో ఓపెన‌ర్ గిల్ నెమ్మ‌దిగా బ్యాటింగ్ ఆరంభించ‌న‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత సిక్స‌ర్ ల‌తో విరుచుకుప‌డ్డాడు.. స్పిన్న‌ర్ల‌లను ఆట ఆడుకున్నాడు.. శ‌త‌కాన్ని 92 బంతుల‌లో పూర్తి చేసుకున్నాడు.. ఇందులో ఆరు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి.. గిల్,అయ్య‌ర్ లు రెండో వికెట్ కి 200 ప‌రుగులు జోడించ‌డం విశేషం. .

ఆట ప్రారంభంలో 8 ప‌రుగులు చేసిన రుతురాజ్ హాజిల్ వుడ్ బౌలింగ్ లో తొలి వికెట్ గా అవుట‌య్యాడు.. అప్ప‌టికి భార‌త్ స్కోర్ 3.4 ఓవ‌ర్ల‌లో 16 ప‌రుగులు. అంత‌కు ముందు 9.1 ఓవ‌ర్ల‌లో ఒక వికెట్ న‌ష్టానికి 79 ప‌రుగులు చేసి ఆడుతున్న స‌మ‌యంలో వ‌ర్షం ప్రారంభ‌మైంది.. దీంతో మ్యాచ్ ను నిలిపివేశారు.. ఆర‌గంట త‌ర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభ‌మైంది.
ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆసీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టును స్టీవ్‌ స్మిత్‌ నడిపించనున్నాడు. తొలివ‌న్డే ను గెలుచుకున్న భార‌త్ ఈ మ్యాచ్ ను సైతం గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది.. కాగా బుమ్రా స్థానంలో తుది జట్టులోకి ప్రసిద్ధ్‌ను తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement