Wednesday, May 15, 2024

ఈ రోజు చంద్రుడిని పూజిస్తే…

హిందువుల అతిముఖ్య పండుగ మహాశివరాత్రి. ఈ మహాశివునితోపాటుగా ఆయన తలపై వుండే చంద్రుడిని కూడా పూజించాలని, ఆ పూజ సర్వ శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతు న్నాయి. ఈ రోజు చంద్రుడు మకరరాశిలో ఉంటాడు. చంద్రుడు ఆరోగ్యం, తెలివితేటలు, సంపదల ప్రదాత. శక్తిమేరకు చంద్రుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే శివరాత్రి రోజు శివయ్యతోపాటు చంద్రుడిని కూడా పూజించాలి. చంద్రుడి ప్రతిమ లేకపోతే, శివుడి తలపై వున్న చంద్రుకి పాలతో అభిషేకం చేయాలి. పాలతో చేసిన తీపి పదార్థాలను చంద్రుడికి సమర్పించాలి. ఈ రోజు ఇంట్లో అందరికీ శ్రేయస్సు కలగాలని చక్కెర కలిపిన పాలను ఇతరులకు దానం చేయాలి. అభిషేకం చేసిన పాలను తీర్థంలా అందరికీ అందించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement