Monday, April 29, 2024

తీర్థం ఎలా తీసుకోవాలి

గుడి అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది తీర్థప్రసా దాలు. తీర్థం అంటే దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు. శివుడికి, లేదా శ్రీ మహావిష్ణు వుని సాలగ్రామ శిలలకు రుద్ర నమక చమకాలతో, పురుష సూక్తం, పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్య పాద్య ఆచమనములు భగవానునకు పూజచేయు వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్ర యందు వుంచి, స్నపనము చేసిన జలము కూడా కలిపి (తులసీదళ సహతమై, పవిత్రమునూ, పాపహరమునూ అగు నీరము తీర్ధము అనబడును) ఇస్తారు.
‘తీర్ధమును ఎలా తీసుకోవాలి?’ అనే ప్రశ్నకు సమా ధానం మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని, పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏమాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వ్రేలి క్రింద కణుపు నకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి తీర్ధం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత, అనంతా, గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో శబ్దం రాకుండా తీసు కోవాలి. తీర్దం తాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసు కోవద్దు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగి లిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి. మొదటిసారి తీసుకున్న తీర్థంతో శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది. రెండో సారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుం టాయి. మూడోది పవిత్రమైన పరమేశ్వరని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి.

  • కామిడి సతీశ్‌ రెడ్డి, 9848445134
Advertisement

తాజా వార్తలు

Advertisement