Thursday, May 16, 2024

భగవంతుని వ్యూహం… బహు విచిత్రం

నిజానికి భగవంతుడు దయా సింధువు. అనాధ బంధువు. ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనుగ్రహిస్తాడో మన లెక్కకు అందదు. నిండుగా, దండిగా, మెండుగా, అవిచ్ఛిన్నంగా భగవంతుడు తన అనుగ్రహాన్ని, భక్తులపై కురిపించేటందుకు సిద్ధంగా ఉంటాడు. అందుకునేందుకు మనం సర్వ సన్నద్ధమై ఉండాలి. అయితే భగవంతుని అనుగ్రహమైనా, ఆగ్రహమైనా మన ప్రాప్తాప్రాప్తాలపైనా, కర్మ వాసనలపైనా, సాధన మీద, నడక మీద, నడత మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో, ఏరకంగా ఎందుకు ఆగ్రహిస్తాడో, ఆ ఆనుగ్రహ ఆగ్రహాలు ఏ రూపాన ఉంటాయో, మన మేధస్సుకు అందదు. ఒకానొక సమయంలో ఓ గురువుగారు శిష్యులతో ముచ్చటిస్తున్నారు. ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తున్నారు. శిష్యులు తదేకంగా వింటున్నారు. మానవులు చేసిన కర్మల ఆధారంగా, భగవంతుడు ఫలితాలను తనదైన పద్ధతిలో, మానవాళికి ఏరకంగా అందిస్తాడో, అందుకోసం భగవంతుని వ్యూహరచన ఏరకంగా ఉంటుందో తెలియజేసే కథ చెప్పటం మొదలు పెట్టారు. ”ఒకాయన యుక్త వయసు వచ్చేక, ఓ అందాల బొమ్మను పెళ్లిచేసుకుని, పండంటి యిద్దరు పిల్లలను కని, సంసారాన్ని హాయిగా గడుపుతున్నాడు. దురదృష్టవశాత్తు భార్య మంచాన పడి. పిల్లలను తల్లిలేని పిల్లలను చేసి, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపో యింది. కాలక్రమంలో ఆ వ్యక్తి మరో స్త్రీని వివాహమాడాడు. ఆవిడ ఆ వ్యక్తికి భార్య అయ్యింది. పిల్లలకు తల్లి కాలేకపోయింది. అక్కసుతో పిల్లలను ఎన్నో విధాలుగా హింసించేది. చిత్ర హింసలకు గురి చేసేది. ఓ రోజు పిల్లలు చిన్న తప్పు చేసారు. మొగుడు లేని సమయం చూసి, కోపంతో ఎర్రగా కాల్చిన ఇనుప చువ్వలతో, యిద్దరి పిల్లల కళ్ళలో పొడిచి, యిద్దరు పిల్లలను అంధులను చేసింది. కళ్ళులేని పిల్లలు పడుతున్న అవస్థలను చూసి, పైశాచిక ఆనందం పొందేది సవతి తల్లి” అని కథ చెప్పటం ఆపి, శిష్యుల వంక ప్రశ్నార్ధకంగా చూసారు గురువుగారు.
”తర్వాత ఏమైందో చెప్పండి గురువు గారూ” అని శిష్యులు అడిగారు.
”ఏమవుంది? కొన్నాళ్ళకు పిల్లల తండ్రీ, సవి తి తల్లి, పిల్లలూ అందరూ కాలం చేసారు” అని చెప్పా రు గురువుగారు. ”సవితి తల్లి చేసిన ఘోరమైన పాపా నికి దేవుడు ఏ శిక్ష వేసాడు? చెప్పండి” అని గురువు గారిని అడిగారు శిష్యులు. ”మీరే చెప్పండి” అన్నారు గురువు.
శిష్యులంతా ఒకే రకమైన సమాధానం చెప్పారు. పసి పిల్లలను ఘోరాతి ఘోరంగా, అంధులను చేసిన మహా పాపానికి ఫలితంగా, కళ్ళులేని కారణంగా పిల్లలు జీవితాం తం ఎన్ని అవస్థలు పడ్డారో, అంతకు అంత సవితి తల్లి అను భవించేలా, కళ్ళులేని కబోదిలా వచ్చే జన్మలో దేవుడు ఆమెని పుట్టించి ఉంటాడు” అని జవాబిచ్చారు శిష్యులు. గురువుగారు పకపక నవ్వారు. మీరు చెప్పింది తప్పు అన్నారు. ఏమైందో మీరే చెప్పి మా సందేహం తీర్చండి గురువుగారూ అని గురువుగారిని శిష్యులు బ్రతిమలాడారు. గురువుగారు చెప్పటం మొదలు పెటారు. మీరు చెప్పిందే జరుగుతుంది అనుకోవడం సహజమే. కానీ అలా జరగలేదు. పై జన్మలో సవితితల్లి స్త్రీగా పుట్టింది. మంచి వ్యక్తినే పెళ్ళి చేసుకుంది. కొంత కాలానికి గర్భందాల్చింది. ఎన్నో ఊహల్లో విహరించింది. రోజులు గడిచా యి. పుట్టు అంధులైన యిద్దరు కవలలకి ఆమె జన్మ యిచ్చింది. గత జన్మలో ఆమె చేసిన ఘోరాతి ఘోరమైన పాపానికి, ఆమెకి వచ్చే జన్మలో దేవుడు వేసిన శిక్ష అది!” అని జరిగింది నిదానంగా చెప్పుకొచ్చారు గురువుగారు. శిష్యులంతా అయోమయంగా చూస్తున్నారు. అవును. అదే దేవుని వ్యూహ రచనలో గమ్మత్తు! కళ్ళులేని కబోదిగా తాను పుడితే అనుభవించే బాధకన్నా, తన కడుపున పుట్టిన పండంటి పిల్లలు కళ్ళులేని కబోదులుగా, నానా అవస్థలు పడుతుంటే, ఆ పిల్లల దీనావస్థని చూసిన కన్నతల్లి పడే వేదన రోదన లక్ష రెట్లు ఎక్కువ ఉంటుంది. అనుక్షణం బాధతో కుళ్ళి కృశించి పోతుంది. అదే ఆమెకి తగిన శిక్ష. ఇదీ దేవుని వ్యూహరచనలో ఉన్న రహస్యం అని వివరంగా చెప్పారు గురువుగారు. శిష్యులకు జ్ఞానోదయమైంది. భగ వంతుని వ్యూహం చిత్రంగా, బహు విచి త్రంగా, ఊహల కందనిగా ఉంటుందని అర్ధమైంది.

  • రమాప్రసాద్‌ ఆదిభట్ల
    93480 06669
Advertisement

తాజా వార్తలు

Advertisement