Thursday, May 2, 2024

కిందపడిన పారిజాతాలతోనే పూజ చేయాలా

సాధారణంగా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఎందుకంటే పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ పుష్పాలతో పూజ చేయడంవల్ల ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండ కలుగుతుందని భావిస్తారు. పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి ఉద్భవించింది. అనంతరం ఈ వృక్షాన్ని విష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్లగా తర్వాత ఈ యుగంలో సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకువచ్చాడు. ఇలా భూలోకంలో ఉన్న ఈ పారిజాత వృక్షానికి పూసిన పుష్పాలు చెట్టు మీద కోయకుండా కిందికి రాలిన పుష్పాలను మాత్రమే ఏరుకొని స్వామికి సమర్పించాలని చెబుతారు.
అలా కిందపడిన పుష్పాలతో స్వామికి ఎందుకు పూజ చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు కేవలం పారిజాత పుష్పాలు మాత్రమే చెట్టు నుండి కోయకుండా ఎందుకు రాలిన పుష్పాలని ఏరుకొని పూజ చేయాలి అనే విషయానికి వస్తే. సాధారణంగా ప్రతి వృక్షం భూమి నుంచి ఉద్భవిస్తుంది కానీ పారిజాత వృక్షం మాత్రం సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది. ఇలా స్వర్గం నుంచి భూలోకంలోకి రావడంవల్ల ఈ వృక్షం నుంచి పూసిన పుష్పాలు మొదటిగా భూమిని తాకిన తర్వాత భగవంతుడికి సమర్పించాలని చెబుతారు. అందుకోసమే పారిజాత వృక్షం కింద ఆవుపేడతో అలికి నేలపై రాలిన పుష్పాలు ఏరుకొని భగవంతుడికి సమర్పించాలి. ఇక పారిజాత వృక్షం ఏ ఇంటి ఆవరణంలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో సిరిసంపదలకు కొదవుండదని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement