Sunday, May 5, 2024

ధనుర్మాస విశిష్టత

సుసౌరమానం, చాంద్రమానం అనేవి మనం పాటించే కాలమానాలు. చాంద్రమానంలో చంద్రుని సంచారాన్ని అనుసరించి మాసముల పేర్లు నిర్ణయించ బడతాయి. చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసముగా వ్యవహరిస్తారు. చిత్త నక్షత్రంలో ఉంటే చైత్ర మాసమని, విశాఖలో ఉంటే వైశాఖ మాసం, మృగశిరలో ఉంటే మార్గ శీర్షమని అంటారు.
సౌరమానం అనగా సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ మాసంగా వ్యవహరిస్తారు. మేషరాశి లో ప్రవేశిస్తే మేషమాసమని, వృషభ రాశిలో ప్రవే శిస్తే వృషభ మాసమని, ధనుర్రాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసంగా ప్రతీతి. ధనుర్మాసం తరువాత సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు ఉత్త రాయణ పుణ్యకాలం, అలాగే కర్కాటక రాశిలో ప్రవేశించినపుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు దక్షిణాయణం రాత్రి, ఉత్తరాయణం పగలు. మకర మాసం కంటే ముందు వచ్చు ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం వంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజాధికములు అధిక ఫలము నిచ్చును. వాటికి కావాల్సిన పూర్వ రంగం ధనుర్మాస వ్రతం. పరిశుద్ధ మైన మనస్సు, పరమాత్మ యందు భక్తి, పరోపకార వాంఛ, లోకకల్యా ణం ఇవన్నీ కాంక్షిస్తూ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. దీనిలో మరొక రహస్యం ఏమనగా వేదం ప్రణ వం ధనువు ద్వారా ధనుర్మాస విశిష్టతను

తెలియజేసింది. ధనువు అంటే ఓంకారం. ధనువులో మూడు వంపులు ఉంటాయి. వాటిని కలిపే ఒక తాడు ఉంటుంది. ప్రణవంలో మూడు వర్ణాలు ఉంటాయి. అకార, ఉకార, మకారాలు. ఆ మూడింటిని కలిపే ది జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, పరిజ్ఞానం. ధనువులో ఒక చివర జీవాత్మ, మరొక చివర పరమాత్మ ఆ రెండింటిని కలిపే తాడు ప్రకృతి లేక అమ్మ(లక్ష్మీదేవి). ఇలా జీవాత్మ పరమాత్మను చేరు సాధనాన్ని తెలిపే మాసం ధనుర్మాసం. ఈ సమయంలో చాంద్రమా నం ప్రకారం మార్గశిరం. పరమాత్మను చేరుటకు ఉత్తమమైన దారిని చూపునది మార్గశిరం. తరువాత వచ్చే మాసం పుష్యం. పుష్యం అంటే ఆనందం. పర మాత్మను చేరే దారిని తెలుసుకున్న వారు పుష్య పూర్ణు లు కాగలరు. ఈ నిగూఢ తత్వాన్ని తెలిపే మాసం ధనుర్మాసం.

తిరుప్పావు సారము

సంసార దు:ఖములను అనుభవించుచున్న జీవులపై దయతో శ్రీమన్నారాయుణుడు అమ్మవారికి (లక్ష్మి) జీవులు ముక్తిని పొందు సులభోపాయము లను మూడింటిని ఉపదేశించెను అవి శ్రీహరి నామసంకీర్తనము, శరణాగతి, పుష్పా ర్చన. ఈ మార్గములను బోధించి జీవులను తరింప చేయదలచిన అమ్మవారు శ్రీ విష్ణుచిత్తులకు తులసీ వనమున లభించినది. శ్రీవిష్ణుచిత్తులు ఈమెకు గోదా అని నామకరణం చేసిరి. యుక్త వయస్సు రాగానే గోదాదేవి శ్రీవటపత్ర శాయిని భర్తగా పొందదలచి, అట్లు పొందుటకు పూర్వము గోపికలు వ్రతమును ఆచరిం చిరని విని తానావ్రతమును అనుకరించి ఒక వ్రతము చేయదలచి 30 పాశురముల రూపంలో వ్రతమును రచించెను. దాని పేరే ‘తిరుప్పావై’.
ఈ తిరుప్పావు మూడు భాగములుగా పేర్కొనె దరు. మొదటి 5 పాశురములు ఉపోద్ఘాతము. తరువాతి పాశురములలో నందగోపుని భవన పాలకుని, ద్వారపాలకుని, మేల్కొలిపి లోనికి వెళ్ళి నందుని, యశోదను, శ్రీకృష్ణభగవానుని, బల రాముని మేల్కొలుపుట, తరువాత నీలాదేవిని మేల్కొలుపుట, తరువాత శ్రీకృష్ణుని నీలాదేవిని ఇరువురిని మేల్కొలుపుట, శ్రీకృష్ణ భగవానుని సభా స్థలిలో వేంచేసి సింహాసనాసీనుని కమ్మని ప్రార్థిం చుట, స్వామి వేంచేయగానే మంగళాశాసనము చేయు ట, తరువాత తాము వచ్చిన పనిని నివేదించి తమకు సర్వ కాల సర్వావస్థల యందు కైంకర్య మును చేయు భాగ్యమును ప్రసాదించ మని ప్రార్థించుట-
ఇది తిరుప్పావై సారము.

– డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement