Monday, May 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 55

55.
మత్కర్మకృత్‌ మత్పరమో
మద్భక్త: సంగవర్జిత: |
నిర్వైర: సర్వభూతేషు
యస్స మామేతి పాండవ ||

తాత్పర్యము : ఓ ప్రియమైన అర్జునా! కామ్యకర్మలు, మనోకల్పనలు అనే కల్మషముల నుండి విడివడి నా శుద్ధభక్తి యందు నియుక్తుడయ్యెడివాడు, నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా భావించి నా కొరకై కర్మనొనరించువాడు, సర్వజీవుల యెడ మిత్రత్వము కలిగినవాడు అగు మనుజుడు తప్పక నన్నే చేరగలడు.

భాష్యము : ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణ లోకము నందుండే కృష్ణునితో సంబంధమును కోరుకున్నట్లయితే ఇక్కడ ఆయనే స్వయముగా ఇస్తున్న సూచనను స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకమును భగవద్గీత సారాంశముగా, మరియు భక్తి యోగమును అత్యుత్తమ యోగా మార్గంగా మనము అర్థము చేసుకొనవచ్చును. దీనిని పాటించుట యందు గుర్తించుకోనవలసిన ముఖ్య అంశాలు :

మత్‌ కర్మ: అనగా మనకున్న శ్రమనంతా కృష్ణ చైతన్య కార్యములకే వినియోగించవలెను. అనగా కృష్ణునితో సంబంధము లేకుండా ఎటువంటి కార్యమును చేయరాదు. అప్పుడు అది కృష్ణకర్మ అనబడుతుంది.

- Advertisement -

మత్‌ పరమ: అనగా కృష్ణుని దామములో కృష్ణుని సాంగత్యమే జీవిత లక్ష్యముగా నిశ ్చయించుకొనుట. అటువంటి వ్యక్తి స్వర్గలోకాలను గాని, సూర్యుడు, చంద్రుడు, ఇంకా చెప్పాలంటే బ్రహ్మ లోకాన్ని కూడా వెళ్ళాలని ఆశించడు.

మద్‌ భక్త : అనగా నవ విధ భక్తి మార్గాలైన శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజనము, వందనము, దాస్యము, పాదసేవనము, సఖ్యము మరియు ఆత్మ నివేదనము వంటి వాటిలలో పూర్తిగా నిమగ్నమగుట. వీటిలో తొమ్మిదింటిని గాని, ఎనిమిది, ఏడు లేదా కనీసము ఒక దానిని పూర్తిగా పాటించినా తప్పక లక్ష్యాన్ని సాధించగలుగుతారు.

సంగ వర్జిత: అనగా కృష్ణున్ని నిరసించు వ్యక్తుల సాంగత్యాన్ని వర్జించుట. అంతే కాక కర్మ ఫలాసక్తితో పనిచేసే వారిని, మానసిక కల్పనలతో సత్యాన్వేషణ చేసేవారి సాంగత్యము కూడా ఉపయోగపడదు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విశ్వరూపసందర్శనయోగో నామ ఏకాదశోధ్యాయ: ||

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement