Tuesday, May 7, 2024

గీతాసారం ( ఆడియోతో….)

అధ్యాయం 7, శ్లోకం 2

జ్ఞానం తేహం సవిజ్ఞానమ్‌
ఇదం వక్ష్యామ్యశేషత: |
యద్‌జ్ఞాత్వా నేహ భూయోన్యత్‌
జ్ఞాతవ్యమవశిష్యతే ||

తాత్పర్యము : జ్ఞానము మరియు విజ్ఞానములను గూడిన సంపూర్ణ జ్ఞానమును నీకిప్పుడు నేను సంపూర్ణముగా వివరించెదను. అది తెలిసిన పిమ్మట నీవు తెలిసి కొనవలసినది ఏదియును మిగిలి యుండదు.

భాష్యము : అర్జునుడు శ్రీకృష్ణుని మిత్రుడు, భక్తుడు గనుక శ్రీ కృష్ణుడు సమగ్ర జ్ఞానాన్ని ఆయనకు తెలిజేయుచున్నాడు. ఈ విధముగా భక్తుడు మాత్రమే భగవంతుని కృపను గురుపరంపరలో పొంది సమగ్రమును తెలియగలుగుతాడు. ఈ భౌతిక జగత్తు, దానితో పాటు ఆత్మ, మరియు ఈ రెండింటికి మూలమైన వాటిని తెలిసికొనుటయే సం పూర్ణ జ్ఞానము లేదా దివ్యజ్ఞానము అనుబడుతుంది. కాబట్టి తెలివిగలవాడు, అన్ని యోగా పద్ధతుల చరమ స్థితి యైన ఆ మూల పురుషుని పై మనస్సును లగ్నము చేసినట్లయితే సర్వజ్ఞానము పొంది, ఇక తెలియవలసినదంటూ ఏమీయును మిగిలి ఉండదు. దీనినే ‘ముండక ఉపనిషత్తు’ ఇలా తెలియజేస్తుంది. ”కస్మిణ్‌ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి”

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement