Thursday, May 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 18
18
అంతవంత ఇమే దేహా
నిత్యస్యోక్తా: శరీరిణ: |
అనాశినో ప్రమేయస్య
తస్మాద్యుధ్యస్వ భారత ||

తాత్పర్యము : అవినాశియును, అపరిమితుడును, నిత్యుడును అగు జీవుని దేహము తప్పక నశించియే తారును. కావున ఓ భరతవంశీయుడా ! నీవు యుద్ధము చేయుము.

భాష్యము : శరీర స్వభావము నశించుట. అది ఈ రోజైనా నశించవచ్చు లేదా వంద సంవత్సరాల తరువాతైనా నశించవచ్చు. కాలము ఆసన్నమయితే మరణించకతప్పదు. కాబట్టి శరీరాన్ని శాశ్వతముగా కొనసాగించలేము. అయితే ఆత్మ ఎంత చిన్నదంటే శత్రువు కూడా చూడలేడు. ఇంతకు ముందు శ్లోకములో వివరించినట్లు కొలత వేయుటకు కూడా వీలుకానంత చిన్న పరిమాణము కలిగి ఉంటుంది. ఈ విషయాలను తెలుసుకున్న వ్యక్తి దు:ఖించవలసిన అవసరము లేదు. ఎందువలనంటే మనము ఆత్మ, అది సంహరింపబడదు. ఇక శరీరాన్నామనము ఎలాగూ కాపాడలేము. ఏదో ఒకరోజు వదలిపెట్టవలసినదే. శరీరాన్ని పోషించే ఆత్మ ముఖ్యము. ఆత్మకర్మానుసారము వేరు వేరు శరీరాలను పొందుతుంది. కాబట్టి సరైన కర్మ చేయుట ముఖ్యము. ఈ ఉన్నత అంశాలను బట్టి అర్జునుడు, శారీరక సంబంధాలను పక్కన పెట్టి తన సరైన కర్తవ్యమయిన యుద్ధము చేయుట ముఖ్యమని ఉపదేశించడమైనది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement