Thursday, May 9, 2024

ధర్మం – మర్మం : గౌతమ మహర్షి వైభవం (ఆడియోతో…)

శంకరుని జటాజుటము నుండి గంగను తీసుకువచ్చే విధానంలో పార్వతి ప్రయత్నం – గౌతమ మహర్షి వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి
వివరణ…

పూర్వము స్థావరజంగమాత్మకమైన జగత్తును సృష్టించ కోరి ఒక పర్వతముపై బ్రహ్మ యజ్ఞ ము ఆచరించగా ఆ పర్వతము ‘బ్రహ్మగిరి’ గా ప్రసిద్ధి పొందెను. బ్రహ్మగిరి పై గౌతమ మహర్షి పరమపావనమైన, పుణ్య ప్రదమైన ఆశ్రమమును నిర్మించుకొనెను. ఆ ఆశ్రమమున కరువు కాటకాలు, ఆధులు (దిగులు), వ్యాధులు, అనావృష్టి భయము, శోకము, దారిద్య్రము ఉండేవి కావు. గౌతమ మహర్షి ఆశ్రమమున తప్ప మరెక్కడా హవ్యము, కవ్యము (పాడిపంటలు) లేవు. ఆ కాలమున భూలోకములో దాత, హోత, యిష్ట అయిన గౌతమ మహర్షి పేరు దేవలోకంలో, మానవ లోకంలో మారుమ్రోగెను. వివిధ ఆశ్రమాలలో ఉండే మునులు, ఋషులు గౌతముడి ఆశ్రమాన్ని చేరిరి. వారందరికీ గౌతమ మహర్షి తగిన రీతిలో తండ్రివలే, భక్తితో పుత్రునివలే పోషించుచుండెను. గౌతముడు ఋషులందరికీ వారి వారి కోరికలను తీరుస్తూ శిష్యుని వలే ప్రార్థించి, శుశ్రూష చేయుచుండెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement