Monday, May 20, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గుముఖం ప‌ట్టిన వెండి ధ‌ర‌

బంగారం ధ‌ర‌లు నేడు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.100 తగ్గి రూ.47,680 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.52,010గా రికార్డయింది. ఢిల్లీలో మాత్రం బంగారంతో పాటు వెండి కూడా దిగొచ్చింది. కేజీ వెండి ధర అక్కడ మార్కెట్లో రూ.500 తగ్గి రూ.61 వేలుగా ఉంది.విజయవాడలో కూడా బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు విజయవాడలో రూ.100 తగ్గి రూ.47,650గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.120 తగ్గి రూ.51,980గా ఉంది. కేజీ వెండి ధర మాత్రం రూ.300 పెరిగి రూ.66,300కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా డాలర్ బలపతుండటం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ రికవరీ కావడంతో.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ ప్రభావంతో దేశీయంగా కూడా ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement