Sunday, April 28, 2024

గణేశ పురాణం

(గత సంచిక తరువాయి)

వేదాలకు, బ్రహ్మకు గల సంబంధం?
బ్రహ్మ ధ్యాన నిమగ్నుడై ఉన్న సమయాన ఆయన వృదియగుహ నుండి ఒక అనీదాత శబ్దం వచ్చి ఓంకారం గా దాని నపుండి నాలుగు వేదాలు, త్రిగుణాలు, ముల్లోకా లు, మూడు అవస్థలు రాగా, బ్రహ్మ నాలుగు వేదాలను తన మానసపుత్రుడైన మరచికి ఇవ్వగా, అతని నుండి అతని కు మారుడు కశ్యపుడు, తర్వాత కాలంలో వేదవ్యాసుడు వేదా లను నాలుగింటిగా విభజించి, ఉపనిషత్‌ సారంతో కూడిన అష్టాదశ పురాణ రచన చేశాడు.
వేదం అనగానేమి? వేదాల పేర్లు ఏవి?
జ్ఞానము. ఋగ్యజుస్సామ అధర్వ వేదాలు.
వేద రక్షకుడు ఎవరు? బ్రహ్మ.
అవి ఎవరి చేతిలో ఉంటాయి? బ్రహ్మ చేతిలో.
వాటిని తస్కరించింది ఎవరు?
సోమకుడు అనే రాక్షసుడు.
అతనిని చంపి, వాటిని తిరిగి బ్రహ్మకిచ్చినదెవరు?
మత్స్యావతారాన శ్రీమహావిష్ణువు.
పురాణం లక్షణం?
సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం, వంశాల చరిత్ర అనే పంచ లక్షణాలు గలది పురాణం.
గణశ పురాణంలోని శ్లోకాలు ఎన్ని? 4093.
స్కంద పురాణంలోని శ్లోకాలు ఎన్ని? 80,000 పైగా
శివపురాణంలోని శాసనాలు ఎన్ని? 24,000 శ్లోకాలు.
వేదాలన్నీ ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతం
గణశ పురాణం ఎవరు చెప్పారు?
వ్యాసుడు తన నలుగురు శిష్యులకు పురాణాలు, ఉప పురాణాలు రూపాన బోధించాడు.
స్కంద పురాణం ఎవరు చెప్పారు?
కుమారస్వామి భూమాతకు తత్పురుష
కల్పంతో చెప్పాడు.
శివపురాణం ఎవరు చెప్పారు?
వాయుదేవుడుకు శివుడు బోధించాడు శ్వేత కల్పంతో.
పురాణాలు ఏయే గుణాలు గూర్చి చెప్తాయి?
వైష్ణవ పురాణాలు సాత్విక గుణాన్ని, బ్రహ్మ పురాణాలు రాజస గుణాన్ని, శైవ పురాణాలు తామస గుణాన్ని గూర్చి చెప్తాయి.
శివుని గూర్చి చెప్పే మరికొన్ని పురాణాలు ఏవి?
లింగ పురాణం, స్కంద పురాణం, వాయు, అగ్ని పురా ణాలు శివుని గూర్చి చెప్తాయి. మరియు ఉపపురాణమైన గణశ పురాణమూ చెప్తుంది.
వేదం చిన్నదా?
కాదు, అది అపారం, అనంతం, అమితం, అపూర్వం.
వేదం చదవాలంటే? ఒక జన్మ చాలదు.
వేదం చదువుకున్న వారిని తెలుగు రాష్ట్రాల్లో ఏమంటారు? ఘనాపాటీలు అంటారు.
వేదం ఒక్కసారిగా వ్రాయబడిందా?
లేదు. వందల, వేల, లక్షల సం||లు పట్టింది. (సశేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement