Thursday, May 9, 2024

ధర్మం – మర్మం : స న్మిత్రుడు (ఎ)

మహాభారత సంకలనం సుభాషిత సుధానిధిలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్య మఖ్యాతి పృచ్యతి
భుఙ్త్కే భోజయతే చైవ షడ్విధం మిత్ర లక్షణం

మిత్రడు తన దగ్గర ఉన్నచో ఇచ్చును, అవసరమున్నపుడు తీసుకొనును, తన రహస్యమును చెప్పును, అతని రహస్యమును అడుగును, అతనింట్లో భుజించును, అతనికి తన ఇంట్లో భోజనము పెట్టును. ఈ ఆరు మంచి మిత్ర లక్షణములు.

సామాన్యముగా లోకంలో ఎదుటి వారి నుండి తనకవసరం ఉన్నప్పపుడు తీసుకొని అతనికి అవసరం ఉన్నపుడు ఇవ్వరు. అలాగే ఎదుటి వారి రహస్యమును తెలుసుకొనే ప్రయత్నము చేస్తారు కానీ తమ రహస్యములను తెలియజేయరు. ఆకలైనపుడు ఎదుటి వారింట భుజించి తాము మాత్రం ఎదుటివాడికి భోజనం పెట్టరు. ఇవి స్వార్థపరుల లక్షణాలు.
కాని మంచి మిత్రుడు తన మిత్రుడికి అవసరమైతే తన దగ్గర ఉన్నదానిని ఆలోచించకుండా ఇచ్చును. అలాగే తనకు అవసరమున్నచో తన మిత్రుడి నుండి తీసుకొనును. ఇచ్చిపుచ్చుకోవడాలలో ఋణ పత్రాలు, సాక్షులు, సంతకాలు లాంటి వ్యవహారాలు ఏమీ ఉండవు. నీది నాది అన్న వివక్ష లేకుండా ఎవరి దగ్గర ఉన్నా ఉమ్మడి సొమ్ముగా భావిస్తారు. అలాగే మంచి మిత్రుల దగ్గర రహస్య విషయాలంటూ ఏవీ ఉండవు. మిత్రునికి ఆకలేస్తే తన ఇం ట్లో భుజింపజేయును అలాగే తనకు ఆకలేస్తే అతనితో భుజించును. ఈ ఆరు సన్మిత్ర లక్షణములు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement