Tuesday, May 7, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల ర‌ద్దీ… శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 30 గంట‌ల స‌మ‌యం

తిరుమల : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. శ్రీవారి దర్శనానికి 30 గంటలు స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆల‌య అధికారులు తెలిపారు. క్యూలైన్లు శిలా తోరణం వద్దకు చేరుకున్నాయి. పెరటాసి మాసం మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింద‌ని అధికారులు అంటున్నారు. అక్టోబర్ 4 వరకు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ అక్టోబర్ 5 మధ్యాహ్నం నుండి క్రమంగా పెరిగింద‌న్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. గురువారం ఉదయం 10 గంటలకు క్యూలైన్లు శిలా తోరణం వద్దకు చేరుకున్నాయి. తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement