Tuesday, May 21, 2024

పరివర్తిత ఆమ్రపాలి…

ఆమ్రపాలి క్రీ.పూ. 500 సంవత్సర ప్రాంతానికి చెందినది. గౌతమ బుద్ధుని సమకా లికురాలు. ఆమ్రపాలి అంటే ”మామిడి చిగురు” అని అర్థం. ఆమ్రపాలికి అంబపా లిక, అంబపాలి, ఆమ్ర అనే నామాంతరాలూ ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులెవరో తెలి యదు. వైశాలి నగరంలో మామిడితోటలో ఒక చెట్టు క్రింద పసిపిల్లగా ఏడుస్తూ పడి ఉంటే సోమదత్తుడు అనే ఆయన ఇంటికి తెచ్చుకొని ఆ పాపను పెంచి పెద్ద చేశాడు. కౌమార దశలో నే ఆమ్రపాలి అపురూప సౌందర్యవతిగా, అద్భుత నాట్య కళాకారిణిగా ఖ్యాతి గడించింది. లిచ్ఛవి జాతికి చెందిన రాజులకు వైశాలి నగరం రాజధానిగా ఉండేది. ఆ కాలంలో అందమై న స్త్రీలు పెండ్లి చేసుకొని కేవలం ఒక వ్యక్తితో జీవించడం కాక, తమకు నచ్చిన పురుషునితో రోజుకు ఒకరితో గడిపే ఆచారం వైశాలిలో ఉండేది. ఆమ్రపాలి తన చిన్ననాటి స్నేహతుడు, ప్రియుడు అయిన పుష్ప కుమారుని వివా#హం చేసుకోవాలనుకొంది. కానీ వైశాలి రాజు మను దేవుని కన్ను ఆమ్రపాలిపై పడింది. ఆమె పెండ్లి రోజునే పుష్పకుమారుని హత్యచేసి మనుదేవు డు ఆమ్రపాలిని వైశాలి ”నగర వధు” (వేశ్య)గా అధికారికంగా ప్రకటించాడు. అలా ప్రకటిం పబడిన స్త్రీకి ఏడు సంవత్సరాలు చెల్లుబాటులో ఉండేలాగా ”వైశాలి జనపద కళ్యాణి” అనే బిరుదు బహూకరింపబడేది.
ఆమ్రపాలి రాజనర్తకిగా నియమింపబడింది. ఆమె జగన్మో#హన సౌందర్యము, అసమా న నాట్య కౌశలం ఎంతోమంది రాజులను, ధనవంతులను ఆకర్షించింది. ఆమె నాట్యం చూడటానికి, ఆమెతో గడపటానికి యాభై ‘కార్ష పణములు’ వెలగా నిర్ణయింపబడింది. స్వల్పకాలంలోనే ఆమ్రపాలి సంపద ఏ రాజు కోశాగారంలో లేనంతగా పెరిగిపోయింది. మగధ సామ్రాజ్యాధీశుడైన బింబిసారుడు వైశాలి రాజ్యంపై దండెత్తి వచ్చి కొంతకాలం ఆమ్రపాలితో ఉన్నాడు. అతని వలన ఆమెకు విమలకొండన్న అనే కొడుకు కలిగాడు. తర్వాత కాలంలో బింబిసారుని పెద్దభార్య కొడుకు అజాతశత్రుడు ఆమ్రపాలిపై మోహంతో వైశాలిపై దండెత్తి వచ్చి తనను కాదనిన ఆమ్రపాలిపై కోపంతో వైశాలి నగరాన్ని మొత్తం తగులబెట్టిం చాడు. ఆమెను బంధించి ఖైదులో ఉంచాడు. ఇది సంక్షిప్తంగా ఆమ్రపాలి చరిత్ర.
గౌతమ బుద్ధుడు తమ మహాపరి నిర్వాణానికి కొంతకాలంముందు వర్షాకాలంలో తన వేలాదిమంది శిష్యులతో వైశాలి నగరానికి వచ్చి ఊరి బయట ఉన్న ఆమ్రపాలికి చెందిన సువిశాలమైన మామిడితోటలో విడిది చేశాడు. ఆమ్రపాలి గురించి ఓషో (ఆచార్య రజనీష్‌) ఇలా చెప్పారు. ఒకరోజు ఆమ్రపాలి తన భవనపు మేడపై నిలబడి ఉన్నప్పుడు క్రిందవైపు వీధి లో ఆత్మవిశ్వాసంతో ఠీవిగా, చేతిలో భిక్షాపాత్రతో నడిచి వెడుతున్న ఒక స్ఫురద్రూపి అయి న యువ బౌద్ధ భిక్షువును చూచింది. అతని రూపం ఆమెను ఆకర్షించింది. గబగబా మేడ దిగి వచ్చి, అతనిని అనుసరించి, ”ఈవేళ మా ఇంట మీరు భిక్ష స్వీకరించమని” కోరింది. ఆమె అభ్యర్థన మన్నించి ఆ యువ భిక్షువు ఆమె వెంట ఆ భవనంలోకి వెళ్ళాడు. అది చూచి ఇతర బౌద్ధ భిక్షువులు ఆశ్చర్యం, కోపం, అసూయ చెంది వెళ్ళి బుద్ధునికి అతనిపై చాడీలు చెప్పారు. ఆయన నవ్వి ఊరకున్నారు.
భిక్షువులు మూడు రోజులకంటే ఎక్కువ కాలం ఒకే ప్రాంతంలో ఉండకూడదనే నియ మం ఉంది. అయితే వర్షాకాలంలో నాలుగు నెలలు సంచారము చేయడం కష్టం కనుక ఆ సమయములో మాత్రం ఒకచోటనే ఉంటారు. ఆమ్రపాలి ఆ యువభిక్షువును వర్షాకాలం నాలుగు నెలలు తన అతిథిగా తన ఇంటిలోనే ఉండమని కోరింది. ఆయన తన గురువు అను మతిస్తే అలాగే ఉంటానన్నాడు. ఒక వేశ్య ఇంట్లో అతడు ఉండుటకు అంగీకరించవద్దని ఇతర భిక్షువులు బుద్ధునికి చెప్పారు. కానీ, బుద్ధునికి ఆ యువ భిక్షువు యొక్క ఇంద్రియ నిగ్రహం, ధ్యాన పక్వతపై విశ్వాసం ఉంది. అందుకే ఆ నాలుగు నెలలు అతను ఆమ్రపాలి ఇంటిలో ఉం డటానికి అనుమతి ఇచ్చాడు. ఆ కాలాన్ని అంతా ఆమ్రపాలి ఆ భిక్షువును వశం చేసుకోడానికి, తన నాట్యం, అందం, ధనం, హోదా, అన్నింటినీ ప్రదర్శించి ఓడిపోయింది. అతని ఆత్మనిగ్ర హము, ధర్మదీక్ష అతనిని చలింపచేయలేదు. చివరకు ఆమ్రపాలే జీవిత సత్యం తెలుసుకొని, పరివర్తన చెంది బౌద్ధ సన్యాసినిగా మారి, బుద్ధుని వద్దకు వచ్చి, జరిగిన విషయం ఇతర భి క్షువులు అందరికీ తెలిసేలా చెప్పింది. బుద్ధుని శరణుకోరి, తన సర్వ సంపదలనూ, విశాలమై న మామిడి తోటను కూడా బౌద్ధ సమాఖ్యకు సమర్పించింది. అప్పుడు బుద్ధుడు శిష్యులకు ”లోతైన ధ్యానం, అవగాహన, ఆత్మ నిగ్రహం కలిగి ఉంటే బాహ్య ఆకర్షణలు మన నిశ్చయా న్ని మార్చలేవు” అన్నాడు. అలా జ్ఞానాన్ని పొంది ఆమ్రపాలి బౌద్ధసన్యాసినిగా మారి, ఈశా న్య దేశాలలో బౌద్ధమత ప్రచారానికి వెళ్ళింది అనేది ఒక కథనం.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాచమడుగు శ్రీనివాసులు శ్రేష్ఠిగారి ఆమ్రపాలి కథనం ఇంకో లాగా ఉన్నది. రాజ నర్తకి, సౌందర్యరాశి అయిన ఆమ్రపాలి రాజాధి రాజుల, ధనవంతుల ప్రాపకంలో అత్యంత ధనవంతురాలై, సుఖంగా జీవించసాగింది. గౌతమ బుద్ధుడు వైశాలి నగరానికి వచ్చాడు. ఆయన గొప్పదనం గూర్చి చెలికత్తెల ద్వారా విని, ఆయన తన వద్దకు ఎందుకు రాలేదా అని ఆశ్చర్యపడింది ఆమ్రపాలి. ఒకరోజు బుద్ధుడు వచ్చి, ఆమె భవనం ముందు నిలబడి భిక్ష కోరాడు. సమస్త ఆభరణాలూ ధరించి, ద్విగుణీకృత అలంకారాలతో ఆమ్రపాలి బయటకు వచ్చి, తన సౌందర్యవంతమైన రూపలావణ్యాలను ప్రదర్శిస్తూ బుద్ధు ని ముందు నిలబడి, నా ఈ దేహాన్ని మీకు భిక్షగా ఇస్తాను. స్వీకరిస్తారా అని వగలొలికిస్తూ అడిగింది. ఆమె మాటలు విని కొంతసేపు కండ్లు మూసుకొని, తర్వాత కండ్లను తెరిచి, బుద్ధు డు ఆమ్రపాలితో ”అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీ భిక్షను తప్పక స్వీకరిస్తాను. అందాక సెలవు”అని చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆమ్రపాలి శరీర పటుత్వం తగ్గిం ది. వేశ్యావృత్తి వలన ఆమె శరీరాన్ని అనేక రోగాలు చుట్టుముట్టాయి. క్రమంగా ఆమె కుష్ఠు రోగి అయ్యింది. కురూపి అయ్యింది. విటులతోబాటు దాసదాసీ జనమంతా దూరమయ్యా రు. సంపద నశించిపోయింది. ఆమె వికార రూపం అందరితో అసహ్యంచుకోబడింది. సమాజంచే బహష్కరింపబడిన ఆమ్రపాలి ఊరి బయట ఒక చిన్న కుటీరంలో దు:ఖ భూయిష్ట జీవితం గడుపసాగింది. ఒకరోజు వర్షం పడుతూండగా సాయంత్రంవేళ, చిరు చీకట్లు అలుముకొంటున్న సమయంలో, తన కుటీర ఆవరణలో కుర్చొని ఉన్న ఆమ్ర పాలికి ‘అమ్మా’ అన్న పిలుపు వినబడింది. ఒక ఆజానుబాహువు తన దగ్గరకు వస్తూండడము చూసి, బుద్ధుడు అని గ్రహంచి, ”అక్కడే ఆగు. సమీపానికి రావద్దు. నేనొక కుష్ఠు రోగిని” అంది ఆమ్రపాలి ”అమ్మా, మరిచావా నన్ను. ఒకరోజు భిక్షకోరి మీ ఇంటికి వస్తే మీ శరీరాన్నే భిక్షగా ఇస్తానన్నారు. అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు తప్పక స్వీకరిస్తానని అన్నా ను. ఇప్పుడు ఆ భిక్షను ఇవ్వమ్మా” అని ఆర్ద్రంగా పలికాడు బుద్ధుడు. ”ఆ రోజు నేను నీకు ఇస్తానన్నది అందం, ఆరోగ్యం, యవ్వనంతో కూడిన శరీరాన్ని. ఈ రోజు ఆ దేహం వ్యాధిగ్ర స్తమయ్యింది” అంటూ దూరం జరిగింది ఆమ్రపాలి. దయామయుడైన బుద్ధుడు ”అమ్మా, అందచందాలతో మాకు అవసరంలేదు. భయంకరమైన రోగంతో దేహం శిథిలమైనా పరివ ర్తన చెందిన మనసు మీది” అంటూ మరింత దగ్గరగా రాసాగాడు. ఆయననుంచి తప్పించు కొని దూరంగా వెళ్ళే ప్రయత్నంలో క్రిందపడిపోయిన ఆమ్రపాలిని తన రెండు చేతులతో ఎత్తుకొని ”నా కన్నతల్లి నా చిన్నప్పుడే చనిపోయింది. ఆమెకు సేవ చేసే భాగ్యం నాకు లేకపో యింది. నీలో నా కన్నతల్లిని చూచుకుంటూ సేవచేసే భాగ్యాన్ని ప్రసాదించు తల్లిd” అంటూ ఆమెను మెల్లగా కుటీరంలోకి చేర్చి, ఆమె తుదిశ్వాస విడిచే వరకూ సేవలు చేశాడు కరుణా మూర్తి బుద్ధ భగవానుడు.
”ఈ ప్రపంచంలో నీవు ఉండవచ్చు. కానీ, నీలో ఈ ప్రపంచం ఉండకూడదు” అన్న ఓషో మాటలు అక్షర సత్యాలు కదా! నిజమైన ప్రేమ, దయ వంటివి మనసుకు మాత్రమే చెందుతాయి. దేహానికి కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement