Tuesday, April 30, 2024

మా నాన్న సూప‌ర్ హీరో.. సుధీర్ బాబు కొత్త చిత్రం

హీరో సుధీర్ బాబు న‌టిస్తున్న కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్ ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు.ఈ చిత్రం యూవీ సంస్థలో తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. మా నాన్న సూపర్‌ హీరో అంటూ తన కొత్త సినిమాను ప్రకటించాడు సుధీర్‌బాబు. అభిలాష్‌ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. లేటెస్ట్‌గా రిలీజైన పోస్టర్‌ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. పోస్టర్‌లో కేరళ స్టేట్ లాటరీ అంటూ కోటి రూపాయలు లాటరీని ఒకరు గెలుచుకున్నట్లు ఓ ఫ్లెక్స్‌ను పెట్టారు. ఇది సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. జై క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కామ్ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.హీరో సుధీర్‌ బాబు మంచి కంబ్యాక్‌ కోసం ఎదురు చూస్తున్నారు. సుధీర్‌ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement