Sunday, May 5, 2024

సూక్ష్మ సేవ (ఆడియోతో…)

నీ నుండి వచ్చే పవిత్రమైన తరంగాలనే సూక్ష్మసేవ అని అంటారు. ప్రేమ, శాంతి, ఆనందము, విజ్ఞానము – ఇవి పవిత్రమైన తరంగాలు.
ఎక్కడైతే నీ ఆలోచనలు, కర్మలు దివ్యంగా ఉంటాయో అక్కడ ఈ పవిత్రమైన తరంగాలు ప్రపంచంలోకి వ్యాపిస్తాయి. కావున నీ ప్రతి క్షణాన్నీ పవిత్రంగా చేసుకో:

సాధారణత్వానికి, దివ్యత్వానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకో, తర్వాత కేవలం దివ్యత్వాన్ని మాత్రమే కార్యంలో వినియోగించు. నీ మనసుకు, శరీరానికి రెండింటికీ నీ యజమానివి అని గుర్తుంచుకో. ఆ స్మృతిలో ఆజ్ఞలు జారీ చేసి నీ శరీరాన్ని, మనసును నియంత్రించు. ఏమి చెయ్యాలి అని నువ్వు మనసుకు చెప్పడం
నేర్చుకున్నప్పుడు నీలోని పాత ఆలోచనా ధోరణులు, అలవాట్లు మారుతాయి.

నీ మనసుకు, శరీరానికి రెండింటికీ యజమానిగా అయి నువ్వు పరిస్థితులను చూసినప్పుడు వాటి బాహ్య రూపాన్నే చూడక దానిలోని సత్యస్వరూపాన్ని గ్రహించగలుగుతావు. నువ్వు తక్కువగా ప్రతిస్పందిస్తావు, ఎక్కువగా స్పందిస్తావు.

నీ హాజరు సత్యతకు ఆహ్వానాన్ని పలుకుతుంది. నీలోని తరంగాలు చేరుకుని చల్లదనాన్ని, శాంతిని తీసుకువస్తాయి. మాటలకన్నా నీ మానసిక స్థితి ద్వారానే ఎక్కువగా సహాయాన్ని అందిస్తావు.

ఈ విధంగా అందరూ లాభపడతారు, కేవలం నీ చుట్టుప్రక్కల వారే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదర సోదరీలందరూ లాభాన్ని పొందుతారు.

- Advertisement -

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement