Monday, May 6, 2024

బ్రహ్మాకుమారీస్‌ — నేర్చుకొనే కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో 12వది ‘నేర్చుకొనే కళ ‘

నేర్చుకొనే కళ :
నేర్చుకోవటం అనగా జీవితములో పరివర్తన. బ్రహ్మా బాబా వృద్ధుడైనప్పటికీ నేను విఆర్థిని అనుకొనే మానసిక వృత్తితో ఉన్నత శిఖారలను అధిరోహించారు. నేర్చుకోవాలనే జిజ్ఞాస కావాలి. బాబా విద్య యొక్క మహత్వం గురించి బోధిస్తూ పిల్లలు మురళీపై ప్రేమ అంటే మురళీధరునితో ప్రేమ వున్నట్లు. కావున మురళి(విద్య) ఏనాటికీ విడిచిపెట్టకుండని చెప్పేవారు. బాబా వృద్ధులకు కూడా పిల్లలు, పిల్లలు అంటూ వారిలో విద్య పట్ల ఆసక్తి కలిగేలా చేసేవారు.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement