Thursday, April 25, 2024

Karnataka: చిత్రదుర్గ ​మఠాధిపతి ఆత్మహత్య.. లైంగిక ఆరోపణలతో మనస్తాపం!

కర్నాటకలో లింగాయత్​ మఠాధిపతులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్య ఇద్దరు మహిళలు మఠంలో స్వామీజీలు మహిళలను ఎట్లా లోబర్చుకుంటారనే విషయాన్ని చర్చించుకున్న ఆడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో వారి మాటల్లో తన పేరును ప్రస్తావించడాన్ని అవమానంగా భావించిన ఓ మఠాధిపతి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు.

అయితే.. నిన్న ఆయన ఈ విషయమ్మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి వరకు భక్తులతో మాట్లాడుతూనే ఉన్నారు. తనకు బతకాలని లేదని, పరువు, ప్రలిష్టలు మంటగలిసిన తర్వాత ఈ బతుకు వ్యర్థమని భక్తులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇవ్వాల (సోమవారం) ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే పోలీసులు ఆయన మరణానికి గల కారణాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

చిత్రదుర్గ మురుఘా మఠాధిపతి, గురు మడివళేశ్వర మఠం పీఠాధిపతి బసవ సిద్దలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకున్నారు. తన పేరును లైంగిక కుంభకోణంలోకి లాగడం బాధాకరమని, కర్నాటకలోని బెలగావి జిల్లా నెగినాహల గ్రామంలోని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

చిత్రదుర్గ మఠంలో మహిళలు, బాలికలు ఎలా లైంగి దోపిడీకి గురవుతున్నారో చర్చిస్తూ ఇద్దరు మహిళల మధ్య జరిగిన సంభాషణతో కూడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఇద్దరు మహిళలు బసవ సిద్దలింగ స్వామీజీ పేరును వారి చర్చలో ప్రస్తావించారు. ఇది తన ప్రతిష్ట, గౌరవాన్ని దెబ్బతీసిందని పోలీసు వర్గాలు తెలిపాయి. మఠం యొక్క భక్తులు లింగాయత్ మతాధికారులను లక్ష్యంగా చేసుకున్నారని, వారి స్వార్థ ప్రయోజనాలపై చర్య తీసుకోవాలని కోరుతూ బెలగావి జిల్లాలోని బైలహోంగళ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కి ఆయన ఫిర్యాదు కూడా చేశారు.

ఆదివారం అర్థరాత్రి వరకు బసవ సిద్దలింగ స్వామీజీ భక్తులతో మాట్లాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఉద్దేశించిన ఆడియోలో తన ప్రస్తావన కించపరిచే విధంగా ఉందని, తనకు ఇక జీవించాలని లేదని బాధపడ్డట్టు భక్తులు తెలిపారు . ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్వామీజీ డెత్ నోట్ కోసం వెతుకుతున్నామని, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement