Saturday, April 27, 2024

కుశలవుల జననం

శ్రీ రామాజ్ఞను అనుసరించి శత్రు ఘ్నుడు చతురంగ బలాలను ముం దుగా మధుపురానికి పంపాడు. ఒక నెల తరువాత ధనుర్ధారియై ఒంటరిగా బయ లుదేరాడు. మార్గమధ్యంలో వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించాడు. మునిని దర్శించి భక్తితో నమస్కరించాడు. వాల్మీకి యథోచితం గా శత్రుఘ్నునికి ఆతిథ్యం ఇచ్చాడు.శత్రుఘ్నుడు ఆ రాత్రి ఆశ్రమంలో విర మించాడు. ఆనాటి రాత్రి సీత కవల పిల్లలను ప్రసవించింది. ముని బాలకులు పరుగు పరు గున వచ్చి, సీతమ్మ కవల పిల్లలకు జన్మ ఇచ్చిం దని వాల్మీకి మహర్షికి చెప్పారు. వాల్మీకి వెంట నే వెళ్ళి పిల్లలకు రక్ష కార్యాలను నిర్వహించా డు. మొదట పుట్టిన శిశువునకు కుశుడు అని నామకరణం చేశాడు. తరువాత పుట్టిన శిశువు నకు లవుడు అని నామకరణం చేశాడు. వాల్మీకి మంత్రాలతో అభిమంత్రించిన రక్షలను వృద్ధ స్త్రీలు కుశలవులకు కట్టారు.సీతాదేవికి కవల పిల్లలు జన్మించడం, వాల్మీకి రక్షా విధులను నిర్వహించడం, కుశ లవులు అని నామకరణం చేయడం. ఇవన్నీ శత్రుఘ్నుడు గ్రహించి ఆనందించాడు. తెల్ల వారిన పిమ్మట వాల్మీకి అనుమతి పొంది, మధుపురానికి బయలుదేరాడు. చ్యవనుడు మున్నగు మహర్షుల ఆశ్రమాలకు చేరాడు.
లవణాసుర వధ

శత్రుఘ్నుడు చ్యవనుని చూసి- ”మునీం ద్రా! లవణాసురుని వశంలో ఉన్న శూలం ప్రభావం ఎలాంటిది? లవణుడు ఆ శూలంతో ఎవరెవరిని వధించాడు?” అని అడిగాడు. రఘువీరా! శూలం మహిమాత్మకమైనది. అది లవణాసురుని వశమైన తర్వాత అతడు ఆ శూలంతో అసంఖ్యాకులైన వీరాధివీరులను చంపాడు.పూర్వం ఇక్ష్వాకు వంశీయుడైన మాంధా త కూడ శూలానికి బలి అయ్యాడు. యువ నాశ్వుని కొడుకు మాంధాత మహా బలపరా క్రమ సంపన్నుడు. మాంధాత స్వర్గలోకాన్ని జయింపతలచి, దాడికి ప్రయత్నించాడు. దేవ లోకంలో సంక్షోభం ఆరంభమయ్యింది. ఇంద్రుడు మాంధాత మనోగతాన్ని తెలుసు కుని, ”రాజా! నీవు భూలోకాన్ని పూర్తిగా జయింపలేకపోయావే! ఇంట గెలిచి రచ్చ గెలవడానికి ప్రయత్నించడం మంచిది కదా!” అన్నాడు. మాంధాత గర్వితుడై భూలోకంలో నాకు లోబడని వాడెవ్వడు? అని అధిక్షేపిం చాడు. మధుని కొడుకు లవణాసురుని నువ్వు జయించావా? అన్నాడు ఇంద్రుడు.మాంధాత ఇంద్రుని మాటలు విని లవ ణాసురుని జయించి, అమరావతిపై దాడి చేస్తాను అని హెచ్చరించి, చతురంగ బలాలతో మధుపురాన్ని సమీపించాడు. మాంధాత లవ ణాసురుని లొంగి పొమ్మని దూతతో సందేశం పంపాడు. లవణాసురుడు దూత పరుష వాక్కులకు కోపోద్రిక్తుడై అతని తలను నరికాడు. దూత తిరిగి రానందువల్ల మాంధాత భగ్గు న రుద్రరూపుడై లవణుడు మాంధాతపై శూలాన్ని ప్ర యోగించాడు. ఆ శూలం ఒక్క క్షణంలో మాం ధాతను, అతని సైన్యాన్ని భస్మీపటలం చేసింది. అది తిరిగి లవణాసురుని వద్దకు చేరింది.
”రాఘవా! నీవు రేపు ఉదయమే లవణు ని చంపగలవు! అతడు అడవికి వెళ్ళగానే మధుపురం ద్వారం వద్ద ధనుర్థారివై అడ్డు నిలి స్తే, నీవు కృతకృత్యుడవు కాగలవు!” అని చ్యవ నుడు శత్రుఘ్నుని దీవించాడు.తెల్లవారగానే లవణుడు మాంసభక్షణకై అడవికి వెళ్ళాడు. ఆ సమయంలో శత్రుఘ్ను డు ధనుర్థారియై మధుపురం ద్వారం వెలుపల నిలిచాడు. లవణుడు అలవాటు ప్రకారం అడ విలో జంతువులను చంపి తిన్నాడు. మరి కొన్ని జంతువులను చంపి, రాత్రి భోజనానికై వాటిని తీసుకుని మధ్యాహ్న సమయంలో మధుపురాన్ని సమీపించాడు. కోట వెలుపల ముఖ ద్వారం వద్ద కాలయముని వలె ఉగ్ర మూర్తియై నిలిచి ఉన్న శత్రుఘ్నుని చూసి, అడ్డు తొలగమని లవణుడు హుంకరించాడు. శత్రుఘ్నుడు యుద్ధానికి ఆహ్వానించాడు. శూలం కొరకు పో తలచి, లోపలికి పోయి వచ్చి నీ పని పడతాను అన్నాడు లవణుడు. శత్రువు యుద్ధానికి ఆహ్వానిస్తూ ఉంటే, ‘వాయిదా వేయడం వీర లక్షణమా!’ అని శత్రుఘ్నుడు అధిక్షేపించాడు.
”రాముడు సోదరుడైన శత్రుఘ్నుని కంట పడ్డావు. నీకు భూమిపై నూకలు చెల్లి నట్లే!” అన్నాడు. ”ఓహో! నీవు రాముని సోద రుడవా? నా బంధువు రావణుని చంపిన రామునిపై ప్రతీకారం తీర్చుకోవాల నే నా సంక ల్పం నెరవేరే అవకాశం ఇన్నాళ్ళకు నాకు లభించింది! నీ చావును వెతుక్కుంటూ నీవే వచ్చావు. ఈ రోజు నా చేతులలో నీ చావు తప్ప దు” అంటూ లవణుడు చెట్లతో, రాళ్ళతో యు ద్ధానికి పూనుకున్నాడు. శత్రుఘ్నుడు దిమ్మ తిరిగి నేలపడి మూర్ఛపోయాడు.శత్రుఘ్నుడు చచ్చాడని లవణుడు భ్ర మించాడు. ఇంతసేపు పోరాడాడు కదా! ఆకలి బాధ అధికమయ్యింది. అడవి నుండి తెచ్చిన మాంసాన్ని భక్షిస్తున్నాడు. శత్రువు చచ్చాడు కదా! ఇక శూలంతో ఏముంది పని? అనుకొ న్నాడు. హఠాత్తుగా శత్రుఘ్నుడు మూర్చ నుం డి తేరుకుని లేచాడు. వెంటనే శ్రీ రాముడు ఇచ్చిన దివ్యాస్త్రాన్ని సంధించి, ఆకర్ణాంతం లాగి వదిలాడు. అది నిప్పులు గ్రక్కుతూ లవ ణాసురుని వధించింది.
మునులు సంతోషించారు. శత్రుఘ్నుడు మధుపురాన్ని కైవసం చేసుకున్నాడు. మునీశ్వ రుల అనుగ్రహంతో మధుపురాన్ని పునర్ని ర్మించాడు. ప్రజలు భోగభాగ్యాలతో సుఖసం తోషాలతో జీవించారు. మధుపురం వైభవ ప్రాభవాలు జగద్విఖ్యాతి పొందాయి. శత్రు ఘ్నుడు పన్నేండేళ్ళు రాజ్యపాలన చేశాడు. తరువాత శ్రీ రాముని దర్శనార్థమై అయోధ్య కు బయలుదేరాడు. వాల్మీకి ఆశ్రమం చేరుకు న్నాడు. వాల్మీకి మహర్షి శత్రుఘ్నుని అభినం దించాడు. సాదరంగా ఆహ్వానించాడు.ఆ రాత్రి శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమం లో బస చేశాడు. కుశలవులు చేస్తున్న రామా యణ కథాగానం విన్నాడు. శ్రవణ హేయంగా రామకథను గానం చేస్తున్న కుశలవుల గాన మాధుర్యాన్ని ఆస్వాదించి ఆనందించాడు. వారి మధుర మంజుల గానాన్ని స్మరణకు తెచ్చుకుంటూ పులకించిపోయాడు. అతనికి తెలియకుండానే క్షణంలో తెల్లవారింది.
శత్రుఘ్నుడు గుండె నిండుగా సంతృప్తి ని, సంతోషాన్ని నింపుకుని అయోధ్యకు వెళ్ళా డు. శ్రీ రాముడు శత్రుఘ్నుని ప్రేమతో చేరదీసి కౌగిలించుకుని అభినందించాడు. ఒక్క వారం ఇక్కడ గడిపి, మధుపురానికి తిరిగి వెళ్ళమని సలహా ఇచ్చాడు. ”రాజు చాలాకాలం రాజ్యా న్ని విడిచి ఉండడం శ్రేయస్కరం కాదు” అని రాముడు ప్రబోధించాడు. రామాజ్ఞను అనుస రించి ఒక్క వారం అయోధ్యలో సోదరులతో, మాతృమూర్తులతో సంతోషంగా గడిపి, శత్రు ఘ్నుడు మధుపురానికి వెళ్ళాడు.
– కె. ఓబులేశు
9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement