Friday, May 3, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 72
72.
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ
త్వయైకాగ్రేణ చేతసా |
కచ్చిదజ్ఞానసమ్మోహ:
ప్రణష్టస్తే ధనంజయ ||

తాత్పర్యము : ఓ పార్థా! ధనంజయా! ఏకాగ్రమనస్సుతో దీనింతటిని నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినవా?

భాష్యము : భగవంతుడు అర్జునునికి గురువుగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి భగవద్గీత అంతా సరిగ్గా అర్థము చేసుకున్నాడో లేదో అని అర్జునున్ని ప్రశ్నించుచున్నాడు. అతనికి అర్థము కాక పోయినచో ఏ అంశమైనా, అవసరమైతే భగవద్గీత అంతా అయినా తిరిగి వి వరించుటకు సి ద్ధముగా ఉన్నాడు. భగవద్గీత అనేది ఏదో ఒక కవిగానీ నవలా రచయిత గానీ వ్రాసినది కాదు. స్వయముగా భగవంతునిచే చెప్పబడినది. కాబట్టి ఎవరికైనా కృష్ణుని నుండి గానీ ఆయన ప్రతినిధి నుండి గానీ వినే భాగ్యము కలిగినచో, వారు అజ్ఞానాంధకారము నుండి బయట పడి తప్పక ముక్త జీవులగుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement