Wednesday, April 24, 2024

Covd-19: అమెరికాలో మళ్లీ కరోనా పడగ..

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వణికిస్తున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికాలో ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు కరోనా కలవరానికి గురి చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రెండు వారాల వ్యవధిలోనే అక్కడ కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. అక్కడ కొవిడ్ కేసుల సంఖ్య 47 శాతం పెరిగింది. సెలవుల్లో సమయం కావడంతో ప్రజలు తమ స్నేహితులు, కుటుంబాలను కలుసుకునే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. కఠిన నిబంధనలు పెట్టింది. మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది.

ఇవాళ్టి నుంచి వచ్చే నెల 15 వరకు ప్రభుత్వ నిబంధనలు అమల్లో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత సమయంలో కరోనాను అదుపు చేసేందుకు తమ వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం మాస్కేనని అధికారులు తెలిపారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. టీకాలు వేసిన వ్యక్తుల కోసం కాలిఫోర్నియా జూన్ 15న రాష్ట్రవ్యాప్త మాస్క్ ఆదేశాన్ని ఎత్తివేసింది. అయితే, తాజాగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుదలతో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement