Wednesday, May 15, 2024

Ayyappa Swamy – నేత్రపర్వంగా అయ్యప్ప మహా పడిపూజ

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్) 27:నిజామాబాద్ నగరంలో అయ్య ప్ప స్వామి మహా పడిపూజ కన్నుల పండువగా నిర్వ హిం చారు. స్వామియే శరణం అయ్యప్ప శరణం.. శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మ రణతో నాందేవాడ ప్రాంత మంతా మారుమోగింది. పట్టణంలోని నాందేవాడ లో బీసీ హాస్టల్ వద్ద లాబీశెట్టి శ్రీనివాస్ (గురుస్వామి), లాబీ శెట్టి శ్రీకాంత్ (గంట స్వామి) వారి నివాసంలో బల్య పల్లి సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజను బుధవారం వైభ వంగా నిర్వహించారు.

మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో… శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేశారు. అష్టాదశ కలశాలతో .. అయ్యప్ప స్వా మికి పంచామృతాభిషేకం చేసి కనుల పండుగగా అయ్యప్ప మహా పడిపూజను నిర్వహిం చారు. అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక అభి షేకా లు నిర్వహిం చారు. స్వామి 18 మెట్ల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి అయ్య ప్ప, గణపతి, కుమార స్వామి విగ్రహలను ప్రతిష్టించి పూజలు చేశారు.

ఆగమయ్య గురు స్వామి, రాజు గురుస్వామి ఆధ్వర్యంలో స్వాములు శరణు ఘోషల మధ్య భజనలు, కీర్తనలు పాడుతూ ప్రత్యేక పడిపూజ చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో మహా పడిపూజ లో పాల్గొని ఎంతో ఉత్సాహంగా పెటేతులై ఆడారు.

ఈ సందర్భంగా లాబీశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేయడం ఎంతో సంతో షాన్ని ఇస్తుందని అన్నారు. ఇందూరులో అయ్యప్ప స్వామి మహా పడిపూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారని పేర్కొ న్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యా త్మిక భావన కలిగి ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement