Thursday, May 26, 2022

అన్నమయ్య కీర్తనలు

రాగం : హంసానంది

ప|| ఉన్నతోన్నతుడు ఉడయవరు
ఎన్ననంతుడే ఈ ఉడయవరు || ఉన్నతోన్నతుడు ||

చ|| సర్వలోకముల శాస్త్ర రహస్యములు
ఉర్విపొడమె నీ ఉడయవరు.
పూర్వపు వేదాంత పుణ్య శాస్త్రములు
నిర్వహించెన న్నిట ఉడయవరు || ఉన్నతోన్నతుడు ||

చ|| కడిసె మోక్ష సాకారము తానై
ఉదుటున నిలిచెనీ ఉడయవరు
ఇదివో శ్రీ వేంకటేశ్వరుని ఈడై
పొదలుచున్నాడు భువిని ఉడయవరు || ఉన్నతోన్నతుడు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement