Friday, April 26, 2024

ది క‌శ్మీర్ ఫైల్స్ చిత్రం గురించి – శ‌శిథ‌రూర్ -ద‌ర్శ‌కుడు..న‌టుల మ‌ధ్య వాగ్వాదం

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ , ది క‌శ్మీర్ ఫైల్స్ చిత్ర డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఈ సినిమాను సింగపూర్ నిషేధించడం దగ్గర మొదలైంది.ఈ సినిమాలో ముస్లింలను ఏకపక్షంగా విలన్లుగా చేసి చూపించారని పేర్కొంటూ ఆ దేశంలో సినిమా ప్రదర్శనపై నిషేధం విధించారు. ఈ విషయంపైనే శశిథరూర్ ట్వీట్ చేశారు. భారత అధికార పార్టీ ప్రమోట్ చేసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాను సింగపూర్ లో బ్యాన్ చేశార‌ని ట్వీట్ చేశారు. దానికి వెనువెంటనే వివేక్ అగ్నిహోత్రి, అనుపమ్ ఖేర్ కౌంటర్లు ఇచ్చారు. మూర్ఖ శిఖామణి శశిథరూర్.. ప్రపంచంలోనే అత్యంత చెత్త సెన్సార్ అని సింగపూర్ కు పేరు. ద లాస్ట్ టెంప్టేషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే సినిమానూ ఆ దేశం బ్యాన్ చేసింది. కావాలంటే మీ మేడమ్ ను అడుగు. ద లీలా హోటల్ ఫైల్స్ అనే రొమాంటిక్ సినిమానూ నిషేధించింది. కశ్మీరీ హిందువుల ఊచకోతపై జోకులు వేయడం మానుకోమ‌ని కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత మరికాసేపటికి.. కశ్మీరీ హిందువుల ఊచకోతపై మాట్లాడొద్దంటూ తన భర్త శశిథరూర్ తన నోరు మూయించారంటూ సునంద పుష్కర్ పాత ట్వీట్ ను పోస్ట్ చేసిన వివేక్ అగ్నిహోత్రి.. ఇది నిజమేనా అంటూ ప్రశ్నించారు. సునంద పుష్కర్ కశ్మీరీ హిందువా అదే నిజమైతే ఆమె ఆత్మో క్షోభించకముందే హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారికి గౌరవం ఇవ్వాలనుకుంటే.. వెంటనే మీ ట్వీట్ ను తొలగించండి. సునందకు క్షమాపణ చెప్పండి’’ అంటూ మరో ట్వీట్ చేశారు. కశ్మీరీ హిందువుల ఊచకోత విషయంలో ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం మంచిది కాదంటూ శశిథరూర్ కు అనుపమ్ ఖేర్ సూచించారు. కశ్మీరీ హిందువైన సునంద పుష్కర్ కోసమైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, కశ్మీరీ పండిట్లపై కొంత సున్నితంగా ఉండాలంటూ సూచించారు. ఓ దేశం కశ్మీరీ ఫైల్స్ ను నిషేధిస్తే సంబరాలు చేసుకోవడం తగదన్నారు. వారి వ్యాఖ్యలకు శశిథరూర్ వివరణ ఇచ్చారు. ఇంతవరకు తాను చూడని ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాలోని అంశాల గురించి తానేమీ మాట్లాడలేదని, కేవలం సినిమా బ్యాన్ చేశారన్న విషయాన్నే తాను పోస్ట్ చేశానని చెప్పారు. కశ్మీరీ పండిట్లను అవమానించలేదని, వారిపై జరిగిన దారుణాలను తక్కువ చేసి చూపలేదని అన్నారు. ఈ విషయంలోకి చనిపోయిన తన భార్యను లాగడం మంచిదికాదన్నారు. కశ్మీరీ హిందువులపై ఆమెకున్న అభిప్రాయాలేంటో తన కన్నా ఎక్కువ తెలిసిన వారు ఎవరూ లేరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement