Thursday, May 9, 2024

అన్నమయ్య కీర్తనలు : ఏమని పొగడుదుమే

ఏమని పొగడుదమే యిక నిను
ఆమని సొబగుల ఆలమేల్మంగ

తెలికన్నుల నీ తేటలే కదవే
వెలయుగ విభునికి వెన్నెలలు
పులకల మొలకల పొదులివికదవే
పలుమరు పువ్వుల పానుపులు

తియ్యని నీమోవి తేనెలే కదవే
వియ్యపు రమణుని విందులివి
ముయ్యక మూసిన మెలక నవ్వుకదె
నెయ్యపు కప్రపు నెరిబాగాలు

కైవసమగు నీ కౌగిలే కదవే
శ్రీ వేంకటేశ్వరు సిరినగురు
తావుకొన్న మీ తమకములే కదే
కావించిన మీ కల్యాణములు

Advertisement

తాజా వార్తలు

Advertisement