Friday, April 26, 2024

క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లింపులో వెసులుబాటు

ముంబై : క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించే గడువు దాటిపోయినప్పటికీ వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఆర్బీఐ వెసులు బాటు కల్పించింది. కొంత మంది గడువు తేది మరిచిపోతుంటారు. ఇలా సకాలంలో బిల్లు చెల్లించని వినియోగదారులపై క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు భారీగా ఆలస్య రుసుము, వడ్డీ, ఇతర అదనపు ఛార్జీలు వేస్తుంటాయి. దీని వల్ల సిబిల్‌ స్కోర్‌పైనా ప్రభావం పడుతుంది. ఇలా చెల్లించే గడువు తేదీ మరిచిపోయిన వినియోగదారులకు ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది. ఇటీవల ఆర్బీఐ క్రెడిట్ కార్డు విషయంలో కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. దీని ప్రకారం క్రెడిట్‌ కార్డు జారీ చేసే సంస్థలు, క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలకు బకాయి పడిన రోజుల గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. గడువు ముగిసిన మూడు రోజుల వరకు వినియోగదారులపై ఎలాంటి అదనపు రుసుములు విధించకూడదు. గడువు తేదీ ముగిసిన విషయాన్ని సమాచారం ద్వారా తెలిపి, చెల్లించేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుది. మూడు రోజుల తరువాత కూడా చెల్లించకుంటే అప్పుడు నిబంధనల ప్రకారం అవపరాధ రుసుం, వడ్డీ వంటివి వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం గడువు ముగిసిన తరువాత మూడు రోజుల వరకు బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంది. ఆలస్య రుసుము కేవలం అవుట్‌స్టాండింగ్‌ అమౌంట్‌పై మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement