Sunday, April 28, 2024

అన్నమయ్య కీర్తనలు : తనకేడ

రాగం : సోమ

తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు
మనను చంచలబుద్ధి మానీనా || ||తనకేడ ||

జడ్డు మానవుడు చదువ జదువ నాస
వడ్డివాడు గాక వదలీనా
గుడ్డికుక్క సంతకుబోయి తిరిగిన
దుడ్డుపెట్లే కాక దొరకీనా || ||తనకేడ ||

దేవదూషకుడై తిరిగేటి వానికి
దేవతాంతరము తెలిసీనా
శ్రీవేంక టేశ్వరు సే వాపరుడుగాక
పావనమతియై పరగీనా || ||తనకేడ ||

Advertisement

తాజా వార్తలు

Advertisement