Tuesday, May 21, 2024

అనన్యం… అనంతం కైలాసనాథుని ఆధ్యాత్మిక వైభవం

మన భారతదేశం అనేక ఆధ్యాత్మిక ప్రదేశాల శోభతో అలరారుతున్న కర్మభూమి. ఎన్నెన్నో వింతలు… విశేషాలకు ఆలవాలమై అద్భుత దేవాలయాల నిలయం. అటువంటి విశిష్ట శివాయం దేవభూమి హిమాచల్‌ ప్రదేశ్‌ సోలాన్‌ జిల్లా జటోలి టౌన్‌లో ఉంది. ఈ శివాలయం నిర్మాణ సౌందర్యం ముందు తాజ్‌మహల్‌ కూడా తక్కువే అంటారు. ఆసియా ఖండంలో అత్యంత ఎత్తైన అద్భుతమైన శివాలయంగా చరిత్ర సృష్టించిన ఈ ఆలయ అందాలు.. అద్భుతాలు అనన్యం. ఆ విశేషాల్లోకి వెళితే…

అత్యంత సుందర ప్రదేశంలో… విశాలమైన ప్రాంగణం లో పర్యాటకులను… శివ భక్తులను ఆకట్టుకుంటూ గొప్ప ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోంది జటోలి శివాల యం. హమాచల్‌ ప్రదేశ్‌ పర్యాటక ప్రదేశాల్లో అత్యంత ఆకర్షణీయమైన దేవాలయం. ఈ అద్భుత ఆవిర్భావానికి దాదాపు నలభై సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరా ల కష్టం అంతా ఈ ఆలయంలో ప్రస్ఫుటమవుతున్నది. ఈ మందిరాన్ని సందర్శించినవారందరూ దీని శిల్పకళా నైపుణ్యం ముందు ప్రపంచంలోని ఏడు అద్భుత నిర్మాణా ల్లో రెండవ స్థానంలో నిలిచిన తాజ్‌మహల్‌ కూడా పనికిరాదనే అభిప్రాయానికి వచ్చేశారంటే మందిర అందాలు ఊహకు అందవు. జటోలి అనే పేరు శివుడి సుదీర్ఘ జట (జుట్టు) నుంచి వచ్చింది. సోలాన్‌ నగరం నుండి ఇది సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
పురాణ కథనం ప్రకారం ఈ ప్రాంతానికి ఆ కైలాసనాథుడు తరలివచ్చాడని, ఇక్కడ కొంతకా లం ఉన్నాడని అంటారు. ఆ తర్వాత స్వామి కృష్ణా నంద్‌ ఇక్కడకు వచ్చి తపస్సు చేశారనీ ప్రతీతి. బాబా పరమహంస మార్గదర్శకత్వంతో జటోలి శివాలయ నిర్మాణం ప్రారంభమైనట్లు చెబుతారు.
ఆలయ నిర్మాణంలో ఎన్నో అద్భుతాలు ఉన్నా యి. ద్రవిష్‌ శైలిలో నిర్మించిన ఈ ఆలయ గోపురం దాదాపు 111 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి వాడిన రాళ్లను చేతితో తడితే ఢమరుకం శబ్దా లు వస్తాయని చెబుతారు. ఈ ఆలయంలో శివుడు స్వ యంగా వచ్చి కొలువుదీరాడని పురాణ కథనం.
ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సుమారు 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ద్రవిడ శైలిలో మూడు వరు స పిరమిడ్లతో నిర్మించారు. మొదటి పిరమిడ్‌లో, రెండవ పిరమిడ్‌లో శేష్‌ గాన్‌ శిల్పం, వినాయకుడి విగ్రహం ఉం టుంది. ఆలయం లోపల, ప్రాంగణంలో వివిధ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారు. లోపల స్పటిక మణి శివలిం గను స్థాపించడంతోపాటు శివ, పార్వతి విగ్రహాలు కూ డా ప్రతిష్టించారు. ఆలయం ఎగువ భాగంలో 11 అడుగు ల ఎత్తైన బంగారు మంటపంను కూడా నిర్మించారు.
ఈ దేవాలయం ఈశాన్య భాగంలో ‘జల్‌ కుండ్‌’ అని పిలిచే వాటర్‌ ట్యాంక్‌ ఉంటుంది. దీన్ని పవిత్రమైన గంగానదిగా భక్తులు భావిస్తారు. ఈ ట్యాంక్‌లో నీరు చర్మ రుగ్మతలను పోగొట్టడానికి చికిత్స చేసే కొన్ని ఔషధ లక్షణాలను కలిగి ఉండటం విశేషం.
ఇక్కడున్న మరో విశేషం ఏమిటంటే- అప్పట్లో ఇక్కడ ప్రజలు నీటి సమస్యతో బాధపడేవారు. అదే సమ యంలో స్వామి కృష్ణానంద శివుడిని ప్రార్థించి వర్షం కురిసేలా చేశారని.. అప్పటి నుంచీ ఈ ప్రదేశంలో నీటి కొరతనేది లేదని చెబుతారు.
స్వామి కృష్ణానంద నివసించిన ఈ ఆలయంలో ఒ క గుహ ఉంటుంది. ఈ గుహలో శివుడు తపస్పు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ గుహకు 300 మీటర్ల దూరంలో శివలింగం ఉంటుంది. శివలింగంకు ఎదురు గా నంది విగ్రహం కొలువై ఉంటుంది.
దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన విరాళాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఎలా వెళ్ళాలి?

సివ్లూ, చండీగఢ్‌ విమానాశ్రయాలు సోలాన్‌ సమీపంలో ఉన్నాయి. విమానాశ్రయం నుండి 30- 40 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ బస్సుల రవాణా సౌకర్యం ఉంది. ఈ దేవాలయం వున్న జటోలికి బస్సు సౌకర్యం లేనందు న బస్సు లేదా రైలు మార్గంలో ప్రయాణించి సోలాన్‌ వెళ్ళి అక్కడ నుండి టాక్సీ లేదా ప్రైవేట్‌ వాహనాల్లో ఆలయానికి వెళ్ళవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement