Sunday, April 28, 2024

Leo-OTT | లియో ఓటీటీ రిలీజ్ పోస్ట్‌పోన్… కొత్త డేట్ ఇదే !

దళపతి విజయ్ నటించిన యాక్షన్-ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ మూవీ లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలైన ఈ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.605 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ మూవీలో సంజయ్ దత్, త్రిష, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

కాగా, ఈ సినిమా నవంబర్ 17న OTT స్క్రీన్‌లపైకి రావాల్సి ఉంది. అయితే, ఓటీటీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ సోంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మూవీ రిలీజ్ డేట్ గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది. లియో మూవీ నవంబర్ 24న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలిపింది. నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్నట్టు వెల్లిండించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement