Sunday, April 28, 2024

Tourism | వీసా లేకుండానే వియత్నాంకు..

భారతీయ టూరిస్టులకు గుడ్‌న్యూస్… ఇకనుంచి వీసా అవసరం లేకుండానే వియత్నాం వెళ్లొచ్చు. వీసా అవసరం లేకుండానే పర్యాటకులను అనుమతించేందుకు వియత్నాం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వియత్నాం రాజధాని హనోయిలో పర్యాటకుల రద్దీని పెంచేందుకు వీసా మినహాయింపు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వియత్నాం సంస్కృతి, క్రీడలు, పర్యాటక మంత్రి న్గుయెన్ వాన్ హంగ్… దేశ రాజధానిలో పర్యాటక రంగాన్ని మెరుగు పరచడానికి భారతదేశం, చైనా వంటి దేశాలకు స్వల్పకాలిక వీసా మినహాయింపులను అమలు చేయాలని ప్రతిపాదించారు. దీంతో మరింత మంది భారతీయులు వియత్నాంలో పర్యటిస్తే.. అది తమకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని ఆ దేశ సర్కార్ యోచిస్తోంది. కాగా, ఇప్పటికే థాయ్‌లాండ్, శ్రీలంక దేశాలు వారి దేశాల్లో పర్యాటక రంగాన్ని మెరుగు పరిచేందుకు వీసా మినహాయింపు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాయి. ఇక అదే బాటలో వియత్నాం కూడా నడవనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement