Sunday, April 28, 2024

అమూల్య సంపద సహనం

సహనం ఒక నిగ్రహ శక్తి. మానసిక పరిపక్వతగల స్థితి. ఈ గుణం కలిగినవారు ఎల్లవేళలా నిశ్చలంగా ఉండగలరు. వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటినీ సుల భంగా పరిష్కరించగలుగుతారు. సహనం మనిషిని ఆలోచింపజేస్తుంది. మనిషి ఆవేశ పడకుండా ఆపుతుంది. మనిషిని ఉన్నత మా ర్గంలో నడిపిస్తుంది. రామాయణంలో శ్రీ రాముడు సహనంలో భూదేవితో సమానమ ని వాల్మీకి మహర్షి అయోధ్యకాండలో వర్ణిస్తా రు. సహనం ఒక అమూల్య సంపద. అందుకే ఈ సుగుణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడవ కూడదు. ప్రతి మనిషికీ తన దైనందిన వ్యవ హారాల్లో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటా యి. మనిషి నిగ్రహశక్తిని పాటించాలి.
సహనంగా వుంటే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో వివరించే కథ ఇది. సృష్టి కార్యం సందర్భంలో బ్రహ్మ దేవుడు పంచ భూతాల ను పిలిచి ఒక్కొక్క వరం కోరుకోమన్నాడు. వరం ఇస్తాను అనగానే ఆకాశం ఆవేశంతో అందరికంటే ముందుగా వరం కోరుకోవాల నుకుంది. వెంటనే అందరికంటే పైన ఉండా లని కోరింది.దాంతో ఎవరికీ అందనంత ఎత్తు లో నిలిపాడు బ్రహ్మ. ఆకాశం మీద కూర్చునే వరాన్ని సూర్యుడు కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు.
వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడి గిన జలం మేఘాల రూపంలో ఆకాశం మీద పెత్తనం చలాయిస్తూనే సూర్యుడుని కప్పేస్తుం ది. పై ముగ్గురినీ జయించే శక్తిని వాయువు కోరడంతో పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవ డం, సూర్యుడు, ఆకాశం కనుమరుగవుతా యి. భూదేవి ”పై నలుగురూ నాకు సేవ చేయా ల”ని కోరింది. దాంతో బ్రహ్మ తథాస్తు అన్నా డు. అప్పటినుండి వారివారి వరాల ఫలితం గా ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది. వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు. వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం. సమస్త జీవ కోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వా యువు. సహనంతో మెలిగి వరం కోరిన భూ దేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి. సహనంగా వుండేవారు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించే చక్కని కథ ఇది.

Advertisement

తాజా వార్తలు

Advertisement