Friday, May 3, 2024

శ్రీ ప్లవనామ సంవత్సర మీన రాశి ఫలాలు

మీన రాశి
ఆదాయం-11, వ్యయం-05
రాజ పూజ్యం-02, అవమానం-04

ఈ సం|| గురుడు ఉగాది 13.4.2021 నుండి 14.9.2021 వరకు మరల 20.11.2021 వత్సరాంతం వరకు కుంభరాశిలో 12వ స్థానంలో అశుభుడైనందున ఋణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో పని పెరిగి పై అధికారులతోనూ, తోటి ఉద్యోగులతోనూ భేదాభిప్రాయములు కలుగవచ్చును. విద్యార్థులకు విదేశీయాన అవకాశములు కలుగును. నిరుద్యోగులకు ప్రయోజనం ఉండును. 15.9.2021 నుండి 19.11.2021 వరకు మకరరాశిలో 11వ స్థానంలో శుభుడైనందున అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటు-ంబంలో అభివృద్ధితో పాటు- ఆకస్మిక ధనలాభముంటు-ంది.

ఈ సం|| శని ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు మకరరాశిలో 11వ స్థానంలో శుభుడైనందున ప్రయత్నకార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముం టు-ంది. కుటు-ంబం అంతా సంతో షంగా కాలక్షేపం చేస్తారు. ఉపాధ్యాయు లకు, డాక్టర్లకు, సినీ యాక్టర్లకు అనుకూల కాలముగా చెప్పవచ్చును.

ఈ సం|| రాహువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృషభరాశిలో 3వ స్థాన ంలో శుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్ప డకుండా మెలగాలి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.

ఈ సం|| కేతువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృశ్చికరాశిలో 9వ స్థానమై సాధారణ శుభుడైనందున స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగానుండుట మంచిది. నూతనకార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.

ఈ రాశివారు గ్రహములకు జపదానములతోపాటు నవగ్రహ స్తోత్రము, మన్యుసూక్త పారాయణ, రుద్రాభిషేకం చేయించుటతో పాటు- పూర్వాభాద్ర వారు పుష్యరాగమును, ఉత్తరాభాద్రవారు నీలమణిని, రేవతి వారు పచ్చను ధరించిన శుభములు కలుగును.

– శ్రీ గుదిమెళ్ళయతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement