Thursday, May 2, 2024

శాంతిని స్థాపించడము (ఆడియోతో…)

మానవ కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్న దుష్ట శక్తులను ఎదుర్కొన్నప్పుడే శాంతిని స్థాపించగలము. లోభము, కోపము, అహంకారము, మోహము, కామము వంటివి శాంతిని నాశనం చేసాయి. అందుకే ఈ ప్రపంచంలో అతి దు:ఖము ఉంది. ప్రశాంతమైన అడవి ప్రాంతాలు వెళ్ళడము లేక ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవడం వలన శాంతి స్థాపన జరుగదు.

ఇక్కడ మనిషి నేర్చుకోవలసింది ” అణుకువ”. మానవ హృదయాలలో జాగృతి కావలసింది ”దయ”. మనల్ని మనం భగవంతుడికి సమర్పించుకోవడమే ఇందుకు ఆరంభం. అప్పుడు, మనందరం కలిసి శాంతిని స్థాపించగలము.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement