Monday, April 29, 2024

జిల్లాల విభజన….పురిటిలోనే బిడ్డ మృతి

ఒక్క రోజు గడిస్తే చాలు ఒల్లో పడుకొబెట్టుకొని జోలలాడించాలని ఆశపడిన తల్లీ ఆశలు ఆవిరయ్యాయి… వైద్యోనారయణ హరి అని శరణు కోరినా జిల్లా విభజన కారణంతో వైద్యం చేయడానికి నిరాకరించిన వైద్యులు… ఆసుపత్రుల చుట్టూ ప్రయాణిస్తూ ఆ ప్రయాణాల్లొనే అనంతలోకాలకు చేరింది ఆ తల్లీ కడుపులోని చిన్నారి తణువు…..ప్రతి తల్లీ గుండెలను పిండేసి ఈ హృదయ విధారకమైన సంఘటన సిద్దిపేట జిల్లా బేగంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళకు గర్భందాల్చి 9నెలల పూర్తై పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్ మాతాశిశు ఆసుపత్రికి తరలించగా మీ జిల్లా వేరు అనడంతో సొంత జిల్లా అయిన సిద్దిపేటకు రాత్రి సమయంలో ప్రయివేటు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని వైద్యులు సూచించారు. గజ్వేల్ ఆసుపత్రి వైద్యులు హైదరాబాద్ లోని నిలోఫర్ కు వెళ్ళాలని అనడంతో చేసేదేంలేక కుటుంబ సభ్యులు తిరిగి కరీంనగర్ లోని మాతా శిశు వైద్యశాలలో డాక్టర్లను బ్రతిమిలాడి ఆసుపత్రిలో చేరగా సర్జరి చేసిన అనంతరం గర్భంలో ఉన్న కవలల్లో ఆడ శిశువు మృతి చెందిందని ఆ తల్లీదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

మగశిశువు ఐ.సి.యూ లో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.ముందే కరీంనగర్ లోనీ ప్రభుత్వ ఆసుపత్రి లో సంప్రదించగా వారు జిల్లా వేరు అనడంతో చికిత్స కోసం ప్రయాణించగా చికిత్స అందక ఆడశిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వైద్యం అందించి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు ఇలా కాలయాపన చేయడం సరికాదని గ్రామస్థులు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement