Sunday, April 28, 2024

రాజరాజేశ్వరీ దేవి

అంబా రౌద్రిని భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముండా శ్రితరక్షపోష జననీ దాక్షాయణీ ప్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!!

దుర్గానవరాత్రులో ఆఖరి రోజైన దశ మి నాటి అవతారము శ్రీరాజరా
జేశ్వరి. పరమేశ్వరుని అంకముపై ప్రకా శముతో వెలుగొందుతూ, భక్తులకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని ప్రసాదించే అవతారము శ్రీరాజరాజేశ్వరి. ఏ దేవి రూప మైన, ఏ శక్తి రూప మైన అన్నిటికి మూలమైన శక్తి పరమేశ్వరి. ఈ రోజు ఈ తల్లిని లలితాస#హస్రనామ పారాయణ చేసి ఆరాధించాలి. చేమంతులతో పూజచేయాలి. భక్ష్య, భోజ్యము లతో మహా నివేదన చేయాలి. బంగారు కవచ ధారణ చేస్తారు. లేదా బంగారు వర్ణముగల
వస్త్రముతో అలంకరిస్తారు.
విజయవాడ కనకదుర్గమ్మ రాజరాజే శ్వరిగాను, శ్రీశైలం భ్రమరాంబ ఈ రోజు సిద్ధి ధాత్రి అవతారంలోను భక్తులకు దర్శన మిస్తారు. సిద్ధిధాత్రి అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈ దేవి కృపతో పొందాడని దేవీపురాణం తెలియచేస్తోంది. ఈ రోజు ఛండీ సప్తశతి, ఖడ్గమాల పారాయణ చేయాలి. ఈ తల్లికి కొబ్బరి అన్నం, నిమ్మ కాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి.
శ్లో. సిద్ధ గంధర్వయక్షాద్య్కెరసరైరమరైరపి!
సేవ్యమానా సదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ!!

Advertisement

తాజా వార్తలు

Advertisement