Wednesday, May 15, 2024

భగవంతుడు నా సర్వస్వము (ఆడియోతో…)

భగవంతుడితో సంబంధాన్ని జోడించడంలో ఉన్న మహత్వాన్ని నీవు గుర్తించావా?
ఎంతో కాలం నుండి మావనవులతో అనేక సంబంధాలు కలిగి ఉండి, ఆత్మ ఎంతో కొరతతో, అలసటతో ఉంది. మానవాత్మ తన జీవిత ధ్యేయాన్నే మర్చిపోయింది.
భగవంతుడిని నీ స్నేహితుడిగా చేసుకోవడం వల్ల వారితో సమీప సంబంధాన్ని అనుభవం చేసుకోవచ్చు, కానీ భగవంతునితో నీ అనుభవాన్ని కేవలం ఒక్క సంబంధం వరకే పరిమితం చెయ్యద్దు. భగవంతుడిని నీ తల్లిగా, తండ్రిగా, సహవాసిగా, ప్రియమైన టీచరుగా, సద్గురువుగా, కొడుకుగా అన్ని సంబంధాలతో అనుభవం చెయ్యి. ప్రతి సంబంధము ఎంతో మధురమైన అనుభూతిని పంచుతుంది. వీటిలో ఏది లోపించినా, ఆ మధురానుభూతిని మానవుల నుండి పొందడానికి నువ్వు ప్రయత్నిస్తావు. ఇది పొరపాటు, ఎం దుకంటే వర్తమాన సమయంలోని ఏ మానవుడూ నీకు నిరంతర, నిస్వార్థ ప్రేమను అందించలేడు. భగవంతునితో ఉన్న సంబంధాలను గురించి కేవలం నీ బుద్ధితో అర్థం చేసుకుని దానితోటే తృప్తి చెందకు. వాటి లోతుల్లోకి వెళ్లి వాటిలోని స్పష్టమైన అనుభూతులను చవిచూడు.

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement