Monday, May 20, 2024

బుద్ధి: కర్మానుసారిణి…

కర్మ ఫలం అంటే ఒక పంట లాంటిది. విత్తనాలు నాటగానే పంట చేతికి రానట్లే. కర్మ ఫలాలు కూడా కాలక్రమంలోనే లభిస్తాయి తప్ప, తక్షణం లభ్యం కావు. దుర్మార్గులు తమ కర్మ ఫలాలను అనుభవించే సంఘటన సమయం ప్రపంచం విస్మ యం చెందేలా ఉంటాయి. పుట్టిన ప్రతి మనిషీ ఒక్క క్షణం కూడా ఏదో ఒక కర్మ చేయకుండా ఉండలేడు. అంటే మనిషికి పుట్టుకతోనే కర్మ కూడ వెంట వస్తుందని తాత్పర్యం. మనిషి జీవితంలో ప్రధా నంగా మూడు విధాలైన కర్మల్ని ఎదుర్కొంటూ ఉంటాడు.
మనిషి చేసే కర్మలు భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలకు సంబంధించినవై ఉంటాయి. మనిషి గతంలో చేసిన పుణ్య పాపా లను ‘సంచిత కర్మలు’గా పిలవబడతాయి. చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై మనిషి అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి ”ప్రారబ్ద కర్మ”లు అంటారు. తెలిసో- తెలియకో ఎవరైనా మం చో- చెడో చేసి వాటికి తనను తాను బాధ్యుడుగా భావించినప్పుడు అది పాప కర్మో, దుష్కర్మో లేక సత్కర్మగానో పిలవబడుతుంది. కర్మానుసారం అతడు తగిన ఫలితం అనుభవించవలసి వస్తుంది.
కర్మ అనంతమైనది. అందుకే తన పరిమిత జీవిత కాలంలో ఎవరూ కర్మని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. అయితే విషయా న్ని స్థూలంగా అర్థం చేసుకోవడమే సాధ్యం కాదు. అంటే ఆ సూక్ష్మం గా కర్మని అర్థం చేసుకోవడం అన్నది ఒక నిరంతర ప్రక్రియ.
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా మనం చేసే కర్మలవల్ల అనేక ఒత్తిళ్లకు లోనవుతుంటాం. అవి భావోద్వేగాల ఊయలలో ఊపుతూ ఉంటాయి. వీటివల్ల చాలాసార్లు మానసిక ప్రశాంతత కరువవుతుంది. లక్ష్య సిద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలని, అంతర్మథనం జరుగుతుంది. త ద్వారా మళ్ళీ తక్షణ కర్మల ఒత్తిడికి అధికంగాలోనవుతాం.
చిత్తంలో నుంచి కర్మ తత్త్వం పుడుతుంది. కాల్చిన ఇనుప చువ్వలు రెండూ, ఒక దానితో ఒకటి కలుస్తాయి. అలాగే పరిశుద్ధ మైన చిత్తం పరిశుద్ధమైన కర్మ తత్త్వంతో కలుస్తుంది. కర్మ ధ్యాన యోగం చిత్తాన్ని ఏకాగ్రతలో ఉంచడానికి దోహదపడుతుంది. దైవత్వ సాధన ఆత్మశక్తి శోధనకు అది సోపానమవుతుందని కర్మ ధ్యాన యోగం నిర్దేశించింది. మౌనం మానసికమైతే దాన్నుంచి కర్మ ధ్యానం సులభతరమవుతుంది. వేదాలు కర్మలు చేయమంటా యి. దానికి భిన్నంగా కర్మలు త్యజించమని కూడ అంటుంది.
బాల్యావస్థలో తల్లిదండ్రులు, గురువులు పెద్దలు మన జీవన శైలికి మెరుగులు పెట్టడానికి అనేక సత్కర్మలు నేర్పుతుంటారు. వాటిని మహా ప్రసాద కర్మలుగా భావించి స్వీకరించిన వారందరూ జీవితంలో ప్రయోజకులైన వారే. కర్మల్ని ఆచరించే ఆలోచనలను మార్చుకుంటూ కొత్తరకం సత్కర్మలు చేస్తూ, మనం సంకల్పించు కున్నది. సాధించుకోవాలి. అది చూసి ముందు తరం ప్రేరణ పొం దాలి. పిన్న వయసులోనే గొప్ప కర్మలు చేయాలనే భావాలు ఎలా కలిగాయా అని వాళ్ళు ఆశ్చర్యపోవాలి.
చాలామందికి ఎదుటి మనిషి చేసే సత్కర్మల్లో తప్పులు వెతు కుతూ రంధ్రాన్వేషణ చేసే అలవాటు అధికంగా ఉంటుంది. గురి వింద గింజ తన కింద నలుపు తెలియనట్లు వీరు తమ తప్పును తెలుసుకోరు. ప్రతి ఒక్కరికి అంతరాత్మ అనేది ఉంటుంది. అది ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. అప్పుడే తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాప హృదయంతో తన ప్రవర్తన సరిదిద్దుకునే ప్రయ త్నం చేయాలి. మనలోని భగవదున్మత్తత, ప్రేమ, పరితాపం, ఇత్యాది కర్మలు ఏ క్షణంలో ఏ కోణంలో వాటిని మనకు అందిస్తుం దో తెలీదు. భగవంతుని పట్ల భక్తి అధికమయ్యేకొలదీ ఆయన తాలూకు పరిమళాన్ని పంచేందుకు కర్మ ల్లో సర్వకాల, సర్వావస్థల్లో అవకాశం ఉం టుంది. చక్కగా కర్మ చేయడం ఒకకళ.
ఇతరులను నొప్పించక కర్మ చేయాలి.
– ఎస్‌.ఆర్‌.భల్లం , 9885442642

Advertisement

తాజా వార్తలు

Advertisement