Friday, April 26, 2024

పది రోజుల్లో 3.79 లక్షలమందికి వైకుంఠద్వార దర్శన భాగ్యం

తిరుమల, ప్రభన్యూస్‌: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిం చుకుని జనవరి 13 నుంచి 22 వరకు 10 రోజుల పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 3.79 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనాన్నికల్పించామని టీటీడీఅధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్య ప్రాంతాల నుంచి ఈనెల 13 నుంచి 20 వ తేది వరకు దర్శనం, రవాణా, వసతి, ఆహారం వంటి సదుపాయాలు వంటివి కల్పించామని, ఇక అలిపిరి నడకమార్గం నుంచి 26,420 మంది, ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) 1.66 లక్షల మంది, సర్వదర్శనం టైంస్లాట్‌ 83 వేల మంది, వర్సువల్‌ సేవలు టికెట్లు కలిగి (కళ్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవ, ఊంజల్‌సేవ) 43,250 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇక భక్తులకు 15.14 లక్షలు లడ్డూలు అందించామని తెలిపారు. ఇక హుండీ కానుల ద్వారా రూ.26.61 కోట్లు ఆదాయం లభించింది. అదేవిధంగా నిఘా, భద్రతా విభాగం 500 మంది శ్రీవారి సేవకులు, 1000 మంది విజిలెన్స్‌, సెక్యూరిటి సిబ్బంది భక్తులకు సేవలందించారని తెలిపారు. వసతి కల్పించడం ద్వారా టీటీడీకి రూ.4.68 కోట్లు ఆదాయం సమకూరిందని, అలాగే స్వామివారికి 1.23 లక్షలమంది తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు. మాతృశ్రీ తరిగొండ వెంగంమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో కలిపి 4.58 లక్షల మందికి భోజనాలు, అల్పాహారం అందించారని, 14,643 మంది ( వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే ) భక్తులకు పాలు, టీ, కాఫీ అందించామని తెలిపారు. గతేడాది నవంబర్‌ 17, 18 తేదిల్లో భారీ వర్షాల కారణంగా భారీ కొండ చరియలు విరిగిపడి తిరుమల రెండవ ఘాట్‌రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. రూ. 1.30 కోట్ల వ్యయంతో యుద్ధ ప్రాతి పదికన మరమ్మతులు పూర్తి చేసి వైకుంఠ ఏకాదశినాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement