Sunday, November 3, 2024

ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి

ఏపీఎస్ ఆర్టీసీ లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఎస్డబ్ల్యూఎస్ రీజినల్ కార్యదర్శి రాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు బస్టాండ్ ఆవరణలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. యూనియన్ నాయకులు దేవరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంజిబాబు మాట్లాడుతూ… ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పదకొండవ పీఆర్సీ ప్రకటించిన సందర్భంగా మొండి చేయి చూపిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా వేతనాలు పెంచేవిధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అలాగే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆప్కాస్ లో విలీనం చేయాలని గత రెండు సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోలేదని, ఆర్టీసీ కార్మికులను ఆప్కాస్ లో విలీనం చేసి ఉంటే ఈరోజు జీవో నెంబర్ 7ప్రకారం కనీసం మూడు వేల రూపాయలు పెరిగి ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26 వేలు బేసిక్ నిర్ణయించి, దానిపైన పీఆర్సి ప్రకారం వేతనాలు పెంచాలని హెచ్.ఆర్. ఏ. డీ ఏ, ఇతర అలవెన్సులు కూడా కాంట్రాక్ట్ కార్మికులకు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలు బస్టాండ్ లో గత సంవత్సరం కరోనా సందర్భంగా కొంత మంది కార్మికులను విధుల నుంచి తొలగించారని ఇప్పటికీ 11 మంది కార్మికులు పనిలోకి తీసుకోలేదన్నారు. లాక్ డౌన్ లో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వేతనాలు ప్రతినెలా మొదటి వారంలో చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement