Friday, April 26, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – అధర్మ పద్ధతి (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

9. ఏక: పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజన:
భోక్తార స్తత్రము చ్యన్తే కర్తా దోషేణ లిప్యతే

పాపములను ఒక్కడు చేయును. ఆ పాప ఫలమును మహా జనము అనగా చాలామంది అనుభవించుచుందురు. ఫలమును అనుభించిన వారు విడువబడెదరు. కర్త మాత్రము దోషమును పొందును.

అధర్మమును ఆచరించినవానికి లభించిన సంపదలను, భోగములను అతని కుటుంబము మరియు బంధుమిత్రులు అనుభవిం చెదరు. అధర్మమును ఆచరించిన వాడు మాత్రమే పాపమును అనుభవించును. అధర్మముతో సంపాదించిన భోగభాగ్యములను భార్యాపిల్లలు అనుభవించినా దొంగతమును చేసినవానిని శిక్షిస్తారు కానీ దొంగ సొమ్మును తిన్న భార్యాపిల్లలను శిక్షించరు కదా.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement