Friday, April 19, 2024

గోపి చంద్ తో నభా నటేష్ రొమాన్స్!!

టాలీవుడ్ హీరో గోపీచంద్ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. దీనితోపాటు సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా గోపీచంద్ శ్రీవాస్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ నటించనుందట. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభా రోల్ అద్భుతంగా ఉండబోతుందట. ఇష్మార్ట్ శంకర్ తర్వాత అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్నప్పటికీ హిట్ కొట్టలేకపోయింది నభా నటేష్. మరో వైపు నితిన్ మాస్ట్రో సినిమాలో కూడా నటిస్తోంది నభా.

Advertisement

తాజా వార్తలు

Advertisement