Friday, April 26, 2024

దసరా నవరాత్రి ఏర్పాట్లు పూర్తి

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటు-వంటి లోటు-పాట్లు- లేకుండా అన్ని ఏర్పా టు- చేసినట్లు- రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. గురు వారం నుండి 15వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులకు చేసిన ఏర్పాట్లను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్ధన్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ, అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు- పూర్తి చేసినట్లు- తెలిపారు. వినాయక -టె-ంపుల్‌ నుండి అమ్మవారి దర్శనం వరకు చేసిన క్యూలైన్లను పరిశీ లించడం జరిగిందన్నారు. క్యూలైన్లలో భక్తులను చేసిన ఏర్పాట్లను పరిశీలించి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు పలు సూచనలు చేశా మన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ త్వరితగతిన భక్తులకు అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాటు- చేసినట్లు- ఆయన తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ముఖ్యంగా త్రాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు- చేశామన్నారు. కమా ండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా లోటు-పాట్లను సరిదిద్దేందుకు పర్యవేక్షించడం జరుగు తుందన్నారు. మంత్రి పర్యటనలో జిల్లా కలెక్టర్‌ జే.నివాస్‌, దుర్గగుడి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి డీ.భ్రమరాంబ, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement