Thursday, April 25, 2024

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

నేడు ధ్వజారోహణంతో వేడుకలకు శ్రీకారం

తిరుమల, ప్రభన్యూస్‌: అఖిలాండ కోటి బ్రాహ్మాండ నాయకునికి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా బుధవా రం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం జరిగింది. సాయంత్రం విష్వ క్సేనుల వారు విశేష ఆభరణాలంకృతులై ఊరేగింపుగా మంగళవాయి ద్యాలతో ఆలయంలోని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేసి, ఆస్థానం నిర్వహించారు. అటు తర్వాత బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో భీజావాహం చేసి అంకురార్పణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీయంగార్లు, టిటిడి చైర్మెన్‌ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఇఓ కె.ఎస్‌.జవహార్‌రెడ్డి దంపతులు, అదనపు ఇఓ ఏవి.ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్‌ఓ గోపినాథ్‌జెట్టి, ఆలయ డిప్యూటిఇఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు వేణుగోపాల్‌ ధీక్షితులు, అర్చకులు,బోర్డు సభ్యులు, టిటిడి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన నేడు ప్రధాన ఘట్టం ధ్వజారోహణం సాయంత్రం 5.10 నుంచి 5.30 గంటల మధ్య మీనలగ్నంలో ప్రారంభం అవుతుంది.
నేడు ద్వజారోహణం..రాత్రి పెద్దశేషవాహనం
బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన నేడు సాయంత్రం ద్వజారోహణం శ్రీవారి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తారు. వైఖానసఆగమ శాస్త్రోక్తంగా గరుడకేంద్ర ప్రతిష్ట, కంకరణ ధారణ, ఆలయ ఆవరణంలోను, బయట, చుట్టూ అష్ట దిక్కు లలోనూ స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా సపరివార దేవతలతో ఊరేగు తూ ఉండగా అష్ట దిక్పాలకులు ఆహ్వానింప బడతారు. అనంతరం స్వామి వారు ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం దగ్గరకుచేరుకుంటారు. మిగిలిన పరివార దేవతలైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగదుడు విమాన ప్రదక్షణలో ఉన్న మండపంలోకి చేరుకుంటారు. తదుపరి శ్రీదేవి, భూదేవి, మలయప్పస్వామి వారి సమక్షంలో వేద గానాల మధ్య మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా అర్చక స్వాములు ద్వజ స్తంభం పై గరుడ ద్వజాన్ని (గరుడ పటాన్ని ఎగురు వేస్తారు) దీనితో ద్వజారోహణ కార్యక్రమం పూర్తి అవుతుంది.
పెద్ద శేషవాహనం
బ్రహ్మోత్సవాలలో తొలిరోజు ద్వజారోహణం పూర్తి అయిన తరువాత శ్రీమల యప్పస్వామి వారు తన ఉభయ నాంచారులతో పెద్ద శేషవాహనం పై భక్తులకు రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు దర్శన మివ్వనున్నారు.భక్తులు శ్రీవేంకటేశ్వరా భక్తి చానల్‌లో వీక్షించగలరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement