Sunday, May 5, 2024

తెలంగాణ టూరిజం అభివృద్ధికి కేంద్ర సహాయం

రామప్ప అభివద్ధిపై ప్రత్యేక దష్టి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ములుగు జిల్లా, రామప్ప దేవాలయాన్ని మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప గుర్తింపు పొందడంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక కృషిచేశారన్నారు. రామప్ప దేవాలయంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరిస్తూ పర్యాటక అభివృద్ధికి తగిన నిధులు సమకూర్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌ ఏయిర్‌ పోర్టు నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి ప్రారంభించుకొని సబ్సిడీతో అతి తక్కువ విమాన చార్జీలతో టూరిజం ప్రాంతాలను సందర్శించేవిధంగా చర్యలు తీసుకుంటామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కట్టడాలు, శిల్పకళా సంపదను పరిరక్షించుకొని వాటిని నేటి యువతరానికి, రాబోయే తరాలకు తెలియపర్చాలని మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. అదేవిధంగా కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోవద్దనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు పైబడిన వారందరికి 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే దిశగా మొదటి, రెండవ డోసులను అందించారన్నారు. త్వరలో 12 సంవత్సరాలు పై బడిన వారికి కూడా వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.అంతకు ముందు హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని, కళ్యాణ మండపాన్ని ఆయన సందర్శించారు.

తెలంగాణ పర్యాటక అభివృద్ధిలో సీఎం కేసీిఆర్‌ విశేష కృషి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రత్యేకంగా కృషిచేస్తున్నారని రాష్ట్ర పర్యాటక, ఎ క్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కాకతీయుల కాలం నాటి అతి పురాతనమైన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడానికి కూడా ప్రత్యేకంగా కృషిచేశారన్నారు. కాకతీయుల నాటి చెరువులను మిషన్‌ కాకతీయ ద్వారా పునర్నిర్మాణం చేయడం జరిగింద న్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ములు గు ప్రాంతంలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాలన్నారు. జి ల్లాకు మంజూరైన గిరి జన యూనివర్సిటీని త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీతక్క కోరారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లిd టూరిజం ప్రత్యేక అధికారి విద్యావతి, టూరిజం చైర్మన్‌ శ్రీనివాస్‌గుప్త, ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య, ఎస్‌పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌, ప్రొఫెసర్‌ పాండరంగారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement