Thursday, April 25, 2024

Huzurabad Bypoll: ఆ పార్టీలకు ఈసీ షాక్

హుజురాబాద్‌లో ఉపఎన్నిక వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నిక జరుగుతున్న హుజురాబాద్ సహా పొరుగునే ఉన్న రెండు జిల్లాల్లోనూ కోడ్ వర్తిస్తుందంటూ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర నిరాశకు గురైయ్యాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో మాత్రమే ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా సమీప గ్రామాలను అడ్డాగా చేసుకుని ఆయా పార్టీలు ప్రలోభాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు విపించాయి. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయంతో ప్రలోభాలకు బ్రేక్‌ పడింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌లో ముందుగా హన్మకొండ, కరీంనగర్‌ జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రమే కోడ్‌ వర్తిస్తుందని ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా, అక్టోబర్ 30న హుజురాబాద్ ఉపఎన్నిక జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఇది కూడా చదవండి: మండిపోతున్న పెట్రోల్ ధరలు.. నేటి రేట్లు ఇవీ

Advertisement

తాజా వార్తలు

Advertisement