Sunday, May 5, 2024

తిరుమల… కిటకిట

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి: తిరుమల శ్రీవారి దర్శనార్ధం భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటుండడంతో తిరుమల గిరుల పై ఎటు చూసినా భక్తులతో కిక్కి రిసిన క్యూ లైన్‌లు కనిపిస్తున్నాయి. భక్తుల అధిక రద్దీ నేపథ్యంలో ఆదివారం వరకు విఐపి బ్రేక్‌ ద ర్శనాలను ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకే టిటిడి పరిమితం చేసిం ది. భక్తుల రద్దీకి అనుగుణంగా టిటిడి ఏర్పాట్లు చేసింది. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనార్దం తండోపతండాలుగా భక్తులు తిరుమల బాట పట్టారు. ఘాట్‌రోడ్డు, నడక మార్గంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటుండ డంతో తిరుమలలో ఎటుచూసినా భక్తులే దర్శనమిస్తున్నారు. శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులలో టికెట్లు లేకుండా వస్తున్న భక్తులందరిని టిటిడి లేపాక్షి వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్‌ గుండా వైకుంఠం క్యూ కాంప్లెక్సులోకి అనుమతిస్తుండడంతో క్యూ కాంప్లెక్సు 1, 2 లోని కంపార్టు మెంట్లన్నీ పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. బుధ వారం అర్దరాత్రి వరకు దాదాపు 35 వేల సర్వదర్శనం టోకెన్లను టిటిడి ఇప్పటికే జారి చేసి ఉండడంతో ప్రస్తుతం శ్రీవారి దర్శనార్ధం క్యూ కాంప్లెక్సులు చేరుకుంటున్న భక్తులను బుధవారం అర్దరాత్రి తరువాత టిటిడి దర్శనానికి అనుమతించనుంది. దాదాపు 40 వేలమందికి పైగా భక్తులు సర్వదర్శనం కోసం కంపార్టుమెంట్లలో వేచి వుండడంతో వీరు శ్రీవారిని దర్శించుకోవాలంటే 15 నుంచి 20 గంటల సమయం పడుతుందని టిటిడి ప్రకటించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టిటిడి క్యూ లైన్‌లో వేచివున్న భక్తులకు ఎప్పటి కప్పుడు అన్నప్రసాదం విభాగం అధికారులు అన్నప్రసాదాలు, తాగునీరు శ్రీవారి సేవకుల సహాయంతో అందచేస్తున్నారు. ఇక ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement